Spirit: ప్రభాస్ ఫ్యాన్స్ కి ఊహించని షాక్.. స్పిరిట్ వాయిదా..?
on May 1, 2025
కొన్ని కాంబినేషన్స్ అనౌన్స్ మెంట్ తోనే సంచలనం సృష్టిస్తాయి. అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబో. వీరి కలయికలో 'స్పిరిట్' మూవీ ప్రకటన వచ్చినప్పటి నుంచే ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే వారికి ఊహించని షాక్ తగిలేలా ఉంది. ఎందుకంటే, స్పిరిట్ వాయిదా పడిందనే వార్త వినిపిస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మారుతి డైరెక్ట్ చేస్తున్న 'ది రాజా సాబ్', హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఫౌజి' షూటింగ్ దశలో ఉన్నాయి. వీటి తర్వాత స్పిరిట్, ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్, కల్కి-2 , సలార్-2 లైన్ లో ఉన్నాయి. రాజా సాబ్, ఫౌజి సినిమాలను పూర్తి చేసి.. ఈ ఏడాది చివరిలో ప్రభాస్ 'స్పిరిట్'ను మొదలుపెడతాడని భావించారంతా. కానీ, ఇప్పుడు ప్రభాస్ సినిమాల ఆర్డర్ మారినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఫౌజి తర్వాత.. ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్, కల్కి-2 చేస్తాడని.. ఆ తర్వాతే స్పిరిట్ స్టార్ట్ చేస్తాడని అంటున్నారు. ఇదే నిజమైతే స్పిరిట్ రెండు మూడేళ్లు వెనక్కి జరిగినట్లే. ఈ లోపు సందీప్ కూడా వేరే ప్రాజెక్ట్ చేసే అవకాశముంది. రణబీర్ కపూర్ తో యానిమల్ కి సీక్వెల్ గా 'యానిమల్ పార్క్' చేయాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం రణబీర్ 'రామాయణ', 'లవ్ అండ్ వార్' వంటి సినిమాలతో బిజీగా ఉన్నాడు.
ఇటీవల రామ్ చరణ్, సందీప్ రెడ్డి కాంబోలో ఓ సినిమా ఉండే ఛాన్స్ ఉందని వార్తలు వినిపించాయి. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో 'పెద్ది' సినిమా చేస్తున్న చరణ్.. ఆ తర్వాత సుకుమార్ తో ఓ సినిమా కమిటై ఉన్నాడు. సుకుమార్ ప్రాజెక్ట్ మొదలవ్వడానికి చాలా టైం ఉందని.. ఈ గ్యాప్ లో సందీప్ సినిమా లైన్ లోకి వచ్చినా ఆశ్చర్యంలేదు అంటున్నారు. మరి స్పిరిట్ నిజంగానే వాయిదా పడిందా? రామ్ చరణ్ తో సందీప్ రెడ్డి కొత్త సినిమా మొదలు పెట్టబోతున్నాడా? వంటి విషయాలపై త్వరలోనే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
