'హరి హర వీరమల్లు'కి కొత్త చిక్కులు.. ఫ్యాన్స్ లో మొదలైన టెన్షన్!
on Jul 20, 2025

ఎప్పుడో ఐదేళ్ల క్రితం మొదలైన 'హరి హర వీరమల్లు' సినిమా.. పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూలై 24న థియేటర్లలో అడుగుపెట్టనుంది. విడుదల తేదీ దగ్గరకు వచ్చింది. ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. జూలై 21న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగనుంది. దీంతో ఇక అంతా సాఫీగా సాగుతోందని అభిమానులు కూడా ఆనందంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో మరో ఊహించని షాక్ తగిలింది. (Hari Hara Veera Mallu)
'హరి హర వీరమల్లు' సినిమాని ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ. దయాకర్ రావు నిర్మించారు. అయితే సూర్య బ్యానర్ లో గతంలో రూపొందిన కొన్ని సినిమాల బకాయిల గురించి తాజాగా కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఫిల్మ్ ఛాంబర్ ను ఆశ్రయించారు. 'ఆక్సిజన్' సినిమాకి సంబంధించి రూ.2.6 కోట్లు రావాల్సి ఉందని ఏషియన్.. 'ముద్దుల కొడుకు', 'బంగారం' సినిమాలకు సంబంధించి రూ.90 లక్షలు రావాల్సి ఉందని మహాలక్ష్మి ఫిలిమ్స్.. ఛాంబర్ కి ఫిర్యాదు చేశాయి. 'హరి హర వీరమల్లు' విడుదలకు ముందే వీటిని సెటిల్ చేయాలని డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నారు. మరి దీనిపై ఎ.ఎం. రత్నం ఎలా స్పందిస్తారో చూడాలి. డబ్బు చెల్లించడం లేదా చర్చలు జరపడం ద్వారా సమస్యను పరిష్కరించుకుంటారేమో చూద్దాం.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



