భైరవం మూవీ రివ్యూ
on May 30, 2025
తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్, ఆదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది, సంపత్, అజయ్, శరత్ లోహితస్వ తదితరులు
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
డీఓపీ: హరి కె వేదాంతం
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: చోటా కె. ప్రసాద్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విజయ్ కనకమేడల
నిర్మాత: కె.కె. రాధామోహన్
బ్యానర్: శ్రీ సత్యసాయి ఆర్ట్స్
సమర్పణ: పెన్ స్టూడియోస్
విడుదల తేదీ: మే 30, 2025
బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda sai srinivas),మంచు మనోజ్(Manchu Manoj),నారా రోహిత్(Nara Rohith)ల ప్రెస్టేజియస్ట్ మూవీ 'భైరవం'(Bhairavam)ఈ రోజు థియేటర్స్ లోకి అడుగుపెట్టింది. నాంది, ఉగ్రం వంటి చిత్రాలని తెరకెక్కించిన విజయ్ కనకమేడల(VIjay Kanakamedala)దర్శకుడు. ప్రచార చిత్రాలు బాగుండటంతో భైరవం అభిమానుల్లో,ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ నే ఏర్పరుచుకుంది. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
అనాధ అయిన శ్రీను( బెల్లంకొండ శ్రీనివాస్), జమీందారుల వంశానికి చెందిన గజపతి వర్మ (మంచు మనోజ్), స్థితిమంతుడైన వరద(నారా రోహిత్ ) చిన్నప్పట్నుంచి ప్రాణ స్నేహితులు. శ్రీనుకి బాల్యం నుంచే 'వారాహి అమ్మవారు'ఒంటి మీదకి వస్తుంటుంది. ఆ సమయంలో అమ్మవారిలా ప్రళయ తాండవం చేస్తుంటాడు. పాలు అమ్ముకొని జీవనాన్ని సాగించే వెన్నెల(అదితి శంకర్) శ్రీను ప్రేమించుకుంటారు. వరదకి భార్య పిల్లలు ఉంటారు. గజపతి కి మాత్రం పెళ్లి అయినా పిల్లలు ఉండరు. తన వంశం గొప్పది అయినా కూడా డబ్బులు లేవని ఎప్పుడు బాధపడుతుంటాడు. ఈ క్రమంలో శ్రీను, గజపతి, వరద ఒకరినొకరు చంపుకునే స్థితికి వస్తారు. ప్రాణ స్నేహితులైన ఆ ముగ్గురు చంపునే స్థాయికి ఎందుకు వచ్చారు? గొడవకి కారణం ఏంటి? రాజకీయం ఏమైనా ఈ ముగ్గురి మధ్య ప్రవేశించిందా? వారాహి అమ్మవారి గుడికి ఆ ముగ్గురికి ఏమైనా సంబంధం ఉందా? శ్రీనుకి వారాహి అమ్మవారు ఎందుకు ఆవహిస్తుంది ? ఈ కథలో చివరకి ఎవరి క్యారక్టర్ ఎలా ముగిసిందనేదే ఈ చిత్ర కథ
ఎనాలసిస్
ఇది ముమ్మాటికీ మంచి కథనే. పైగా ఈ తరం జనరేషన్ కి తెలియాల్సిన కథ కూడా. కాకపోతే కథనంలో ఉన్న లోపాలు, డైలాగులు సరిగా లేకపోవడం మైనస్. ఫస్ట్ హాఫ్ లో కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ని గజపతి, వరద కుటుంబాలు, శ్రీను, వెన్నెల మధ్య మిక్స్ చెయ్యచ్చు. కానీ దర్శకుడు ఆ దిశగా ఆలోచించలేదు. కథ మొత్తం కొన్ని గ్రామాల్లోనే జరుగుతుంది. కాబట్టి ఆ వాతావరణంలో కామెడి ని ఎస్టాబ్లిష్ చేసుండాల్సింది.క్యారెక్టర్ ల ఎలివేషన్ కే ఎక్కువ సమయం ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే సినిమా ప్రారంభమే ఒక పోలీసు ఉన్నతాధికారి భైరవం కథ చెప్తాడు. అలా కాకుండా శ్రీను క్యారక్టర్ ద్వారా చెప్పించాల్సింది. వరద, గజపతి, శ్రీనుకి మధ్య వచ్చిన సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ కలుగుతుంది. మిగతా ఆర్టిసుల మధ్య నడిచే సన్నివేశాలు మాత్రం మెప్పించలేకపోయాయి. అనవసరమైన సీన్స్ చాలానే ఉన్నాయి. క్యారక్టర్ల పరిచయం, వాటి తాలూకు బ్యాక్ గ్రౌండ్ బాగున్నా సన్నివేశాల పరంగా తేలిపోయాయి. ఈ కథకి మూల స్థంభమైన వారాహి అమ్మవారి చరిత్రని కూడా సరిగా ఎస్టాబ్లిష్ చెయ్యలేదు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కథనాల్లో వేగం పెరిగి ఎవరు ఎలాంటి వారో క్లియర్ అయ్యింది. ముఖ్యంగా గజపతి, వరద, శ్రీను మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులని మెస్మరైజ్ చేసాయి.ఒక్క సీన్ అని కాకుండా ప్రతి సీన్ కూడా ఎంతో ఇంట్రస్ట్ ని కలిగించాయి. మనం ఊహించని విధంగా మెస్మ రైజ్ చేస్తాయి. ఒక రకంగాసెకండ్ హాఫ్ ఈ సినిమాని నిలబెట్టిందని చెప్పవచ్చు. క్లైమాక్స్ లో శ్రీను కి అమ్మవారు ఆవహించి ఉన్నప్పుడే గజపతి క్యారక్టర్ మాట్లాడటంతో సినిమాని ఎండ్ చెయ్యాల్సింది.
నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు
శ్రీను గా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ రకరకాల వేరియేషన్స్ లలో, విజృంభించి నటించాడు. ముఖ్యంగా వారాహి అమ్మవారు ఆవహించే టైంలో సాయి శ్రీనివాస్ చేసే నృత్యం, పుష్ప 2 లో అల్లు అర్జున్ చేసిన జాతర ఎపిసోడ్ ని గుర్తు చేసింది. గజపతి క్యారక్టర్ లో లయన్ ఈజ్ బ్యాక్ అనుకునే విధంగా మనోజ్ నటించాడు. తన కళ్ళు, వాయిస్ కి ఎంత పవర్ ఉందో భైరవం ద్వారా మరోసారి చాటి చెప్పాడు. వరద గా నారా రోహిత్ కూడా ఒక రేంజ్ లో నటించి ఎంత వాల్యుబుల్ నటుడో, మరోసారి రుజువు చేసాడు. అదితి శంకర్(Adithi Shankar)తన పెర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. తమిళ నటి అయినా అచ్చ తెలుగు అమ్మాయిలా సూపర్ గా చేసింది. మిగతా క్యారక్టర్ లలో చేసిన దివ్య పిళ్ళై, ఆనంది, సంపత్, అజయ్, శరత్ లోహితస్వ కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఫొటోగ్రఫీ , దర్శకత్వం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. సాంగ్స్ మాత్రం చెప్పుకునే విధంగా లేవు. నిర్మాణ విలువలు మాత్రం చాలా బాగున్నాయి.
ఫైనల్ గా చెప్పాలంటే బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచుమనోజ్, నారా రోహిత్ తో పాటు మిగతా నటీనటుల పెర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటాయి. కథనాలు, కామెడీ,డైలాగ్స్ సరిగా లేకపోవడం మైనస్. కాకపోతే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బెటర్.
రేటింగ్ 2 .5 /5 అరుణాచలం

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
