ప్రియుడుతో ఎంగేజ్ మెంట్ కి సిద్ధమైన నటి.. పెళ్లి మాత్రం ఇప్పుడు కాదు
on Jan 23, 2026

-అనుపమ తో స్టార్ హోదా
-ప్రియడు ఎవరు!
-పెళ్లి ఎందుకు లేటు
స్టార్ ప్లస్ లో టెలికాస్ట్ అయిన 'అనుపమ'(Anupamaa)సీరియల్ తో ఫుల్ పాపులారిటీ సంపాదించిన నటి 'అద్రిజా రాయ్'(Adrija Roy).సదరు సీరియల్ లో 'రహి' అనే క్యారక్టర్ లో అత్యద్భుతంగా చేసి సీరియల్ హిట్ రేంజ్ ని కూడా పెంచింది. ఇమ్లీ, కుండలి భాగ్య, దుర్గ ఔర్ చార్ అనే మరికొన్ని సీరియల్స్ తో పాటు కొన్ని చిత్రాల్లోను చేసింది. త్వరలోనే అద్రిజా పెళ్లి పీటలు ఎక్కనుంది.
ఈ మేరకు ఈ నెల 25 న ఎంగేజ్ మెంట్ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. వరుడు ఎవరో కాదు తన ప్రియుడు విగ్నేష్ అయ్యర్. సదరు ఎంగేజ్ మెంట్ పై అద్రిజా రాయ్ మాట్లాడుతు ఈ సంవత్సరమే పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చెయ్యడం లేదు. వచ్చే రెండేళ్ళల్లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం. కానీ పెళ్లి ఎప్పుడు జరిగినా దక్షిణ భారతీయ సంప్రదాయం ప్రకారమే జరుగుతుందని వెల్లడి చేసింది. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా అద్రిజా కి కంగ్రాట్స్ చెప్తున్నారు.
Also read: ఏం చెయ్యాలి.. వరుస డిజాస్టర్ కి కారణం ఇదేనా!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



