ENGLISH | TELUGU  

అల్లు శిరీష్ పెళ్లి ఆహ్వానం.. చిరంజీవికి ఏమైంది..?

on Feb 15, 2026

 

అల్లు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్(Allu Sirish) పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. గతేడాది అక్టోబర్ లో నయనిక రెడ్డితో  శిరీష్ నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది మార్చి 6న వీరి వివాహ వేడుక జరగనుంది.

 

అల్లు వారి పెళ్లి పిలుపులు మొదలయ్యాయి. తెలుగు సంప్రదాయం ప్రకారం మొదటి శుభలేఖను మేనత్త కుటుంబానికి అందించారు. శిరీష్ తన తల్లిదండ్రులతో కలిసి వెళ్ళి.. చిరంజీవి-సురేఖ దంపతులకు శుభలేఖ ఇచ్చి వివాహానికి ఆహ్వానించాడు. (Chiranjeevi)

 

 

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్న శిరీష్.. ఒక ఫొటోను కూడా షేర్ చేశాడు. అయితే ఆ ఫోటోలో చిరంజీవి చేతికి సపోర్ట్ బ్యాండ్ ఉంది. దీంతో చిరంజీవికి ఏమైంది? షూటింగ్ లో ఏమైనా గాయమైందా? అనే చర్చ జరుగుతోంది.

 

ఇదిలా ఉంటే, అల్లు కుటుంబంలో మార్చి 6 తేదీకి ప్రత్యేకత ఉంది. అల్లు అర్జున్ వివాహం 2011 లో మార్చి 6 నే జరగడం విశేషం.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.