సింగిల్ మూవీ టాక్ పై అల్లుఅర్జున్ కీలక వ్యాఖ్యలు
on May 9, 2025
శ్రీవిష్ణు(Sri Vishnu)కేతిక శర్మ(Kethika Sharma)ఇవానా(Ivana)జంటగా ఈ రోజు థియేటర్ లోకి అడుగుపెట్టిన మూవీ సింగిల్(Single). కార్తీక్ రాజు దర్శకత్వంలో అల్లు అరవింద్, విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మించారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, విటివి గణేష్, ప్రభాస్ శ్రీను, సత్య, ముఖ్య పాత్రల్లో కనిపించారు. మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ని రాబట్టింది.
ఇప్పుడు ఈ మూవీపై అల్లుఅర్జున్(Allu arjun)'ఎక్స్'(X)వేదికగా స్పందిస్తు సింగిల్ మూవీకి హిట్ టాక్ వచ్చింది. శ్రీ విష్ణుకి ఆల్ ది బెస్ట్. ఇవానా, కేతికలకు బిగ్ చీర్స్, షో రాకర్ వెన్నెల కిషోర్ కి, నిర్మాతలకి ఆల్ ది బెస్ట్ అని బన్నీ ట్వీట్ చేసాడు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ తన తదుపరి మూవీని తమిళ దర్శకుడు 'అట్లీ'(Atlee)తో చేస్తున్నాడు. అల్లు అర్జున్ పుట్టిన రోజు ఈ మూవీని అధికారకంగా అనౌన్స్ చేసారు. అల్లు అర్జున్ కెరిరీలోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు.
జూన్ చివరి వారం నుంచి లేదా జులై మొదటివారంలో షూటింగ్ కి వెళ్లే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ సరసన ముగ్గురు హీరోయిన్లు జత కట్టబోతున్నారని తెలుస్తుంది. సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
