ఆదర్శ కుటుంబం హౌస్ నెం 47 ఈ రోజే.. అభిమానుల్లో జోష్
on Dec 10, 2025

-అభిమానుల్లో భారీ అంచనాలు
-ak 47 అంటే ఏంటి!
-వెంకీ, త్రివిక్రమ్ మాయాజాలం షురూ
తెలుగు చిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేసిన విక్టరీ వెంకటేష్(Venkatesh),మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikiram)కలయికలో కొత్త మూవీ గురించి అనౌన్స్ మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆ ఇద్దరి కలయికలోని మూవీ ఎప్పుడెప్పుడు షూటింగ్ కి వెళ్తుందా అని అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా వెంకటేష్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే, చక్కిలిగింతలు పెట్టే హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల మేళవింపుతో కుటుంబ బంధాలను, విలువలను తెలియజేసే చిత్రాలను తెరకెక్కించడంలో త్రివిక్రమ్ దిట్ట. అందుకే ప్రకటనతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.
వెంకటేష్ సినీ ప్రయాణంలో 77వ చిత్రంగా తెరకెక్కుతుండగా “ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47” అనే ఆసక్తికర టైటిల్ ని ఖరారు చేశారు. టైటిల్ లోగోని గమనిస్తే.. వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంలో ఉత్కంఠ రేకెత్తించే అంశాలు కూడా ఉంటాయని అర్థమవుతోంది. టోటల్ గా 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47” ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. వెంకటేష్ ఫ్యామిలీ మ్యాన్ లుక్లో క్లాస్ గా కనిపిస్తున్నారు. అదే టైం లో హృదయాన్ని తాకే భావోద్వేగాలతో నిండిన ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రాబోతోందనే సంకేతాన్ని ఫస్ట్ లుక్ ఇస్తోంది. ఈరోజు హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ మొదలైంది.
Also read: అఖండ-2 కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన కొత్త రేట్స్ ఇవే
త్రివిక్రమ్ శైలి భావోద్వేగాలు, హాస్యం, కుటుంబ విలువలను మేళవిస్తూ తెరకెక్కించే చిత్రంలో వెంకటేష్ నటిస్తుండటం ప్రేక్షకుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచింది. వెంకటేష్ తో కలిసి, ప్రేక్షకుల హృదయాలలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని త్రివిక్రమ్ అందిస్తారనే అంచనాలు ఉన్నాయి.వెకంటేష్ త్రివిక్రమ్ కలయిక మరోసారి ప్రేక్షకులందరికీ చిరస్మరణీయమైన అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది.
ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ పతకంపై ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 వేసవిలో భారీగా విడుదలకు సిద్ధమవుతోంది. . టైటిల్, ఫస్ట్ లుక్ విడుదలతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రేక్షకులు, అభిమానులు ఈ అద్భుత కలయిక తెరపై ఏ మాయ చేస్తుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా. హాస్యం, భావోద్వేగాల మేళవింపుతో వెండితెరపై వినోదాల విందుని అందించడానికి టీం మొత్తం రెడీ అవుతుంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



