45 Trailer: ఇదెక్కడి ట్రైలర్ రా మావ.. లేడీ గెటప్ లో సూపర్ స్టార్!
on Dec 16, 2025

కేజీఎఫ్, కాంతార సినిమాలతో కన్నడ పరిశ్రమ పేరు పాన్ ఇండియా స్థాయిలో మరోమోగిపోయింది. ఇప్పుడు కన్నడ నుంచి రాబోతున్న మరో పాన్ ఇండియా మూవీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే '45'. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. (45 Movie)
శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం '45'. సూరజ్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామాతో ప్రముఖ సంగీత దర్శకుడు అర్జున్ జన్య డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతుండటం విశేషం. (45 Trailer)
'45' మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. రెండున్నర నిమిషాల నిడివితో రూపొందిన ఈ ట్రైలర్.. ఉపేంద్ర సినిమాలను తలపించేలా వైవిధ్యంగా, ఆసక్తికరంగా ఉంది.
Also Read: డేవిడ్ రెడ్డి మూవీలో రామ్ చరణ్!
"అక్కడ సమాధి చూస్తున్నావ్ కదా. ఆ సమాధి మధ్య మనిషి పుట్టిన తేదీ డ్యాష్(-) మరణించిన తేదీ రాసి ఉంటుంది. ఆ మధ్యనున్న చిన్న డ్యాషే మనిషి మొత్తం జీవితం" అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది.
సెటప్ పూర్తి కొత్తగా ఉంది. శివ రాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి శెట్టిల పాత్రలతో పాటు.. ఇందులోని వాహనాలు, ఆయుధాలు అన్నీ విభిన్నంగా కనిపిస్తున్నాయి. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్ చివరిలో శివ రాజ్‌కుమార్ లేడీ గెటప్ లో కనిపించడం హైలైట్ గా నిలిచింది.
'45' మూవీ కన్నడలో డిసెంబర్ 25న విడుదవుతుండగా.. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో జనవరి 1న విడుదల కానుంది.
ట్రైలర్ తో అందరి దృష్టిని ఆకర్షించిన '45' మూవీ.. కంటెంట్ తోనూ సర్ ప్రైజ్ చేస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



