సంక్రాంతి విన్నర్ ఎవరు.. మీకు తెలుసా!
on Dec 8, 2025

-ఎవరు విజేత
-మొత్తం ఎన్ని సినిమాలో తెలుసా!
-అభిమానులు ఏమంటున్నారు
-సంక్రాంతి ఎప్పుడు మొదలు
సంవత్సరం పొడవున సినిమాల మధ్య పోటీ అనేది వస్తూనే ఉంటుంది. కాని సంక్రాంతికి ఏర్పడే పోటీ మాత్రం రసవత్తరంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అభిమానులు, మూవీ లవర్స్ కి కూడా సదరు పోటీ మంచి కిక్ ని ఇస్తుంది. సంక్రాంతి హుంగామాకి ముహూర్తం దగ్గర పడుతుండటంతో సదరు కిక్ ని ఏ మాత్రం డిజప్పాయింట్ చేయకూడదనే ఉద్దేశ్యంతో కొత్త సినిమాలు పందెం కోళ్ల లాగా ముస్తాబవుతున్నాయి. దీంతో సంక్రాంతి విజేతగా ఏ మూవీ నిలుస్తుందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. మరి ఏ ఏ చిత్రాలు సంక్రాంతి బరిలో నిలుస్తున్నాయో చూద్దాం.
ముందుగా పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్'(Prabhas)జనవరి 9 న 'రాజాసాబ్'(The Rajasaab)తో సంక్రాంతి పందానికి అంకురార్పణ చేయనున్నాడు. చాలా కాలం తర్వాత వింటేజ్ ప్రభాస్ కనిపిస్తుండటంతో పాటు, ఫస్ట్ టైం ప్రభాస్ హర్రర్ థ్రిల్లర్ చేస్తుండటంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో రాజా సాబ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రచార చిత్రాలు కూడా అందుకు తగ్గట్టే ఉండటంతో రిజల్ట్ పై అందరిలో ఆసక్తి ఏర్పడింది. ఇక ఇదే రోజు మరో పాన్ ఇండియా స్టార్' ఇళయ దళపతి విజయ్'(VIjay)వన్ మాన్ షో 'జననాయగాన్'(Jananayagan)వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.
పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కగా విజయ్ ఆఖరి చిత్రంగా ప్రచారం జరుగుతుంది. దీంతో జననాయగాన్ ని ఏ రేంజ్ లో తెరకెక్కించి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. తెలుగులో జననాయకుడు అనే టైటిల్ తో విడుదల కానుండగా అభిమానులు , ప్రేక్షకుల్లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకుంది. మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi)మన శంకర వరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad garu)తో సంక్రాంతి సందర్భంగానే ల్యాండ్ అవ్వబోతున్న విషయం తెలిసిందే.
అధికారకంగా డేట్ ని ప్రకటించకపోయినా సంక్రాంతికి రెండు రోజుల ముందే రానుందనేది టాక్ . చాలా కాలం గ్యాప్ తర్వాత చిరంజీవి చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కావడంతో పాటు సాంగ్స్, ప్రచార చిత్రాలతో మంచి బజ్ ని ఏర్పాటు చేసుకుంది. పైగా వరుసహిట్స్ తో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి దర్శకుడు. దీంతో అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి. ఇక మాస్ మహారాజ రవితేజ(Ravi teja)కూడా సంక్రాంతి కుర్చీ పై కన్నేశాడు.
రవితేజ స్టైల్లో నే మాస్ అంశాలుతో పాటు ఈ సారి ఫ్యామిలీ అంశాలు కూడా ఒక రేంజ్ లోనే ఉండనున్నాయి. దీంతో సంక్రాంతికి అందరు సందడి చేసే ఫ్యామిలీ అండ్ యాక్షన్ మూవీగా సినీ సర్కిల్స్ లో చర్చ నడుస్తుంది. ఇక సంక్రాంతికి నేను కూడా ఉన్నాను అన్నట్టుగా శర్వానంద్(sharwanand)మరో ఫ్యామిలీ మూవీ 'నారి నారి నడుమ మురారి'తో అడుగుపెట్టనున్నాడు. గతంలో సంక్రాంతి సమయంలో పెద్ద హీరోలతో పోటీపడి శర్వానంద్ రెండు సార్లు విజయాన్ని అందుకోవడంతో 'నారినారినడుమమురారి' పై ఆసక్తి నెలకొని ఉంది.
also read: ప్రేమలో పడిన అమీర్ ఖాన్.. వయసు 60 ఏళ్ళు
ఇక పండగరోజైన 14 న 'పరాశక్తి' తో శివ కార్తికేయన్ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నాడు. విభిన్న చిత్రాల హీరోగా గుర్తింపు పొందిన నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' తో సందడి చేయనున్నాడు. ప్రచార చిత్రాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. దీంతో సంక్రాంతి సినిమాల ఫలితంపై అభిమానుల్లోఆసక్తి నెలకొని ఉంది. మూవీ లవర్స్ మాత్రం అన్నిచిత్రాలు తమని అలరించాలని కోరుకుంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



