ENGLISH | TELUGU  
Home  » 

హీరో సునీల్ ఇంటర్వ్యూ

on Feb 17, 2016

 

సినిమాల మీద ప్రేమతో ఇండస్ట్రీకి వచ్చాడు. కష్టపడి కమెడియన్ గా స్టార్ స్టేటస్ సంపాదించాడు. తర్వాత హీరోగా మారి వరసగా సినిమాల్లో నటిస్తూ తన తడాఖా చూపించాడు. మధ్యలో మంచి కథ కోసం రెండేళ్ల పాటు గ్యాప్ తీసుకున్నా ఇప్పుడు కృష్ణాష్టమి సినిమాతో శుక్రవారం ప్రజల ముందుకు వస్తున్నాడు హీరో సునీల్ వర్మ. ఈ సందర్భంగా, తెలుగువన్ తో సునీల్ ఎక్స్ క్లూజివ్ గా షేర్ చేసుకున్న విషయాలు, విశేషాలు మీకోసం...

" రొమాన్స్ సీన్స్ నాకు అనుకూలంగా మార్చుకున్నా..! "


సినిమాలో నా పాత్ర ఒక ఎన్నారై. ఇండియా అంటే ప్రాణం. అందుకే ఇక్కడే ఉండిపోవడానికి వస్తాడు. ఓపిక చాలా ఎక్కువ. కానీ కొట్టాల్సి వస్తే మాత్రం ఎవరూ కొట్టనంత బలంగా కొడతాడు. ఈ సినిమాలో నేను రొమాన్స్ చేశానా అని అడుగుతున్నారు అందరూ. వాసువర్మ( డైరెక్టర్) ఈ పాత్రను అలాగే డిజైన్ చేశాడు. కథ ప్రకారం కొన్ని సీన్లు తప్పకపోయినా, నేను జాగ్రత్తగా ఆ సీన్లు నాకు అనుకూలంగా మార్చేసుకున్నానులెండి (నవ్వుతూ).



" నా సినిమాల్లో ది బెస్ట్.. "


కృష్ణాష్టమిలో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్ మెంట్ లో మీకు క్వాలిటీ కనిపిస్తుంది. నేను ఇప్పటి వరకూ చేసిన సినిమాల్లో మర్యాద రామన్న అంత క్వాలిటీగా ఉన్న సినిమా కృష్ణాష్టమి. ఏదైనా పెద్ద హీరో సినిమాను ఊహించుకుని, ఆ హీరో ప్లేస్ లో నేనుంటే ఎలా ఉంటుందో, ఈ సినిమా అలా ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ కంప్లీట్ హ్యాపీగా ఉన్నాం.



" కష్టమే సుఖం, సుఖమే కష్టం "


నాకు ఒక ఫిలాసఫీ ఉంది. కష్టమే సుఖం, సుఖమే కష్టం. ఎగ్జాంపుల్ కి, ఒకడు బాగా సుఖపడుతున్నాడనుకోండి. మంచిగా ఏసీ, టైం కి ఫుడ్డు లాగిస్తా సుఖంగా పడుకుని ఉంటే, కొన్నాళ్లకు చెకప్ లో బీపీలు, షుగర్లు వస్తాయి. అదే రోజంతా చెమడోచ్చి ఒళ్లు నెప్పులతో పడుకునే వాడికి, అప్పటికి అది కష్టమే అయినా, లాంగ్ లైఫ్ లో చిన్న జలుబు కూడా చేయదు. ఇదే నేను కూడా నమ్ముతాను. నేను కష్టపడి పైకొచ్చాను అంటారు గానీ, నాకు ఆ కష్టం చాలా ఇష్టం. అందుకే ఇప్పుడు కూడా సిక్స్ ప్యాక్ నెపంతో, జిమ్ చేస్తూ కష్టపడుతున్నాను.
 


" సిక్స్ ప్యాక్ ఎవరైనా చేసేయచ్చు "


అందరూ సిక్స్ ప్యాక్ కష్టమా అని అడుగుతున్నారు. సిక్స్ ప్యాక్ చాలా ఈజీ. నేను చెప్తుంటే ఎవరికీ అర్ధం కావట్లేదండీ బాబూ. నేనే సిక్స్ ప్యాక్ చేశానంటే, ఎవరైనా సిక్స్ ప్యాక్ ట్రై చేసెయచ్చు (నవ్వుతూ). నా దృష్టిలో నవ్వించడం కంటే, సిక్స్ ప్యాక్ చేయడమే ఈజీ. సిక్స్ ప్యాక్ కావాలంటే రోజూ జిమ్ కెళ్లి ఒకే రకమైన ఎక్సర్ సైజులు చెయ్యాలి. కానీ నవ్వించాలంటే మాత్రం, ఒక్కోరోజు ఒక్కోలా ఉండాలి. రెగ్యులర్ గా ఒకేలా ఉన్నా బోర్ కొట్టేస్తాం. ఒక్కో ఇంటర్వ్యూ ఒక్కోలా ఉన్నట్టే, సినిమాల్లో కామెడీ విభిన్నంగా ఉంటేనే ప్రేక్షకులు నవ్వుతున్నారు.



 

" హీరో అయ్యాక ఇంటరాగేషన్లే ఎక్కువగా ఉంటున్నాయి "


ఇంటర్వ్యూల్లో నేను జనాన్ని ఇన్ స్పైర్ చేసేవి చెప్పాలనుకుంటా. కానీ నాకు ఆ అవకాశమే రావట్లేదు. కమెడియన్ గా ఉన్నప్పుడు నాకు ఇంటర్వ్యూలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పడు మాత్రం ఇంటరాగేషన్లు ఎక్కువైపోయాయండీ బాబూ(నవ్వుతూ)..తప్పు చేసినోడ్ని అడిగినట్టు అడుగుతున్నారు అందరూ..హీరో మీద ఉండే ఫోకస్ వల్ల కూడా అలా అడుగుతుంటారు. హీరో అయ్యాక ఏం చేసినా దాన్ని అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు. అందుకే నాకు రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగింది.
 


"త్రివిక్రమ్ మాట విని బాగుపడ్డాను "


జీవితం అనేది అనుభవాల సారం. తండ్రి ముప్ఫై ఏళ్ల పాటు తను పడిన కష్టాన్ని, అనుభవాన్ని కొడుక్కి చెబితే, కొడుకు జీవితం ఆ ముప్ఫై ఏళ్లను కలుపుకుని మొదలవుతుంది. తన అనుభవాన్ని నాకు అలాగే అందించాడు త్రివిక్రమ్. తన మాట వినే నేను బాగుపడ్డాను. కోట్లకు కోట్ల విలువైన కాన్ఫిడెన్స్ ను అందించిన త్రివిక్రమే నాకు గైడ్. తన లాంటి ఫ్రెండ్ ఉంటే ఎవరికైనా సరే సక్సెస్ గ్యారంటీ.



" నమ్మకాన్ని నిలబెట్టేలా ' కృష్ణాష్టమి ' ఉంటుంది "

మీరు హాల్ కు నన్ను నమ్మి వస్తారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా కృష్ణాష్టమి ఉంటుంది. హాల్ కు వచ్చినందుకు డిజప్పాయింట్ అవరు. నా మీద నమ్మకంతో వచ్చి సినిమా చూడండి.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.