సోనాక్షి ఆ పెళ్లికి వెళుతుందా?
on Jun 15, 2015
.jpg)
ఆన్ స్క్రీన్ తో పాటూ ఆఫ్ స్క్రీన్ లోనూ షాహిద్-సోనాక్షి ప్రేమలో ముగనితేలుతున్నారనే గుసగుసలు వినిపించాయి. అయితే ప్రస్తుతం షాహిద్ ఓ ఇంటివాడవుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ విషయంపై సోనూ ఏం ఫీలవుతుందో ఏమో అని అడిగితే....పెళ్లికి వెళతా అని ట్విస్ట్ ఇచ్చిందట అమ్మడు.
ప్రేమగురించి గతంలో చాలాసార్లు అడిగితే ఇద్దరం జస్ట్ ఫ్రెండ్స్....హడావుడి చేయకండి అంది. ముద్దుగుమ్మలు అలా చెప్పడం కామన్ ....రానురాను విషయం తెలుస్తుందిలే అనుకున్నారంతా. ఇంతలో షాహిద్ కు పెళ్లి ఫిక్సవడంతో విషయం మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పుడైనా మనసులో మాట చెబుతుందేమో అని చూస్తే అంతసీన్ లేదంది. పెళ్లికి వెళ్తారా అంటే....పిలిస్తే తప్పకుండా వెళ్తానంటోంది. అంతేనా ఈ మధ్య ఓ ఫంక్షన్ లో కలసినప్పుడు షాహిద్ కు కంగ్రాట్స్ కూడా చెప్పానని...తనకు చాలా సంతోషంగా ఉందని అతి చేసింది.
ఇంత చెప్పినా ఇంకా ఏదో ఉందనుకుంటే మీ ఇష్టం అందట. అయినా మనమేం అనుకుని ఏ లాభం....షాహిద్ కు కాబోయే భార్యకు క్లారిటీ వస్తే చాలుకదా అని బీటౌన్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకీ సోనాక్షి.....షాహిద్ పెళ్లికి వెళుతుందంటారా?
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



