'కింగ్‌డమ్' మళ్ళీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
on May 11, 2025
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'కింగ్‌డమ్'(Kingdom). సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ మార్చి 28న విడుదల కావాల్సి ఉండగా, మే 30కి వాయిదా పడింది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో 'కింగ్‌డమ్' కోసం విజయ్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా మళ్ళీ వాయిదా పడినట్లు తెలుస్తోంది.
'కింగ్‌డమ్' జూలై మొదటి వారంలో విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి 'కింగ్‌డమ్' మళ్ళీ వాయిదా అంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' మే 30న విడుదల కానుందని, అందుకే 'కింగ్‌డమ్' తన రిలీజ్ డేట్ ని త్యాగం చేసిందని న్యూస్ వినిపించాయి. కానీ, 'వీరమల్లు'తో సంబంధం లేకుండానే ఇప్పుడు 'కింగ్‌డమ్' జూలైకి వాయిదా పడిందనే వార్త ఆసక్తికరంగా మారింది. జూన్ రెండో వారంలో 'వీరమల్లు', జూలై మొదటి వారంలో 'కింగ్‌డమ్' విడుదల కానున్నాయి అంటున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
