ఈ ఏడాదే విజయ్-రష్మిక పెళ్లి?
on Feb 21, 2022

తెరపైనా, తెర బయటా విజయ్ దేవరకొండ, రష్మికా మందన్న మధ్య కెమిస్ట్రీ సూపర్‌గా ఉంటుంది. కొంత కాలంగా ఆ ఇద్దరూ ముంబైలో జంటగా కనిపిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. దీంతో వారిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారనీ, త్వరలో పెళ్లికూడా చేసుకుంటారనీ రూమర్స్ వస్తున్నాయి. ఆ ఇద్దరూ ఈ ఏడాది చివరలో పెళ్లి చేసుకుంటారంటూ తాజాగా వదంతులు మొదలయ్యాయి. అయితే ఇంతదాకా, ఇటు విజయ్ కానీ, అటు రష్మిక కానీ తమ అనుబంధం గురించి పెదవి విప్పలేదు. తాము మంచి స్నేహితులం అని మాత్రమే ఇదివరకు వారు చెప్పారు.
'గీత గోవిందం' లాంటి బ్లాక్‌బస్టర్ మూవీలో తొలిసారి జంటగా నటించారు విజయ్, రష్మిక. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్'లో మరోసారి జోడీ కట్టారు. ఆ ఇద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. 'డియర్ కామ్రేడ్' సినిమా తర్వాత విజయ్ కుటుంబానికి రష్మిక బాగా సన్నిహితమైంది. నిజానికి విజయ్ ఇంట్లో జరిగిన వేడుకల్లో రష్మిక కనిపించింది కూడా.
విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో 'లైగర్' మూవీ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. మరోవైపు రష్మిక కూడా రెండు హిందీ సినిమాల్లో నటిస్తూ తను కూడా తరచూ ముంబైకి వెళ్తోంది. ఇప్పటికే ఆమె ముంబైలో ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేసి అక్కడ ఉంటోంది.
అంతే కాదు, ఈ కొత్త సంవత్సరం గోవాలో దేవరకొండ బ్రదర్స్‌తో టైమ్ స్పెంట్ చేసింది రష్మిక. విజయ్ తల్లితండ్రులు మాధవి, గోవర్దన్‌రావుతో కూడా రష్మిక సన్నిహితంగా మెలగుతూ వస్తోంది. కాగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి గురించి తన అభిప్రాయాలు వెల్లడించిన 25 ఏళ్ల రష్మిక, పెళ్లి చేసుకోవడానికి తానింకా చిన్నదాన్నేనని చెప్పింది. అయితే విజయ్, రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారనేది కేవలం ఒక రూమర్‌గా మిగిలిపోతుందా? లేక నిజమవుతుందా? కాలమే జవాబు చెప్తుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



