Home

»

Gossips

వెంకీతో గీతా ఆర్ట్స్ 'డ్రైవింగ్ లైసెన్స్‌'!

Dec 5, 2021 10:18PM

 

ఒకప్పుడు మెగా కాంపౌండ్ కే ప‌రిమిత‌మైన గీతా ఆర్ట్స్ సంస్థ‌.. ఇప్పుడు బ‌య‌ట క‌థానాయ‌కుల‌తోనూ సినిమాలు చేస్తోంది. ఈ క్ర‌మంలోనే.. సీనియ‌ర్ స్టార్ విక్ట‌రీ వెంక‌టేశ్ తోనూ ఈ అగ్ర నిర్మాణ సంస్థ ఓ చిత్రం చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తోంద‌ని స‌మాచారం.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. మ‌ల‌యాళంలో మంచి విజ‌యం సాధించిన `డ్రైవింగ్ లైసెన్స్` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు గ‌త కొంత‌కాలంగా క‌థ‌నాలు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ రీమేక్ తాలుకూ రైట్స్ ని మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తీసుకున్న‌ట్లు ఆ మ‌ధ్య ప్ర‌చారం జ‌రిగింది కూడా. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఇప్పుడా హ‌క్కులు గీతా ఆర్ట్స్ సంస్థ తీసుకుంద‌ట‌. 

Also read:  మూడు మ‌హా మూవీల‌ మ‌ధ్య‌ 'బంగార్రాజు'కు థియేట‌ర్లు దొరుకుతాయా?

అంతేకాదు.. ఇందులో మోటార్ వెహిక‌ల్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా వెంకీ న‌టించ‌నుండ‌గా.. స్టార్ హీరో పాత్ర‌లో మాస్ మ‌హారాజా ర‌వితేజ లాంటి మ‌రో స్టార్ ని న‌టింప‌జేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. ఒరిజిన‌ల్‌లో ఈ రోల్స్‌ను సూర‌జ్ వెంజ‌ర‌మూడు, పృథ్వీరాజ్ సుకుమార‌న్ చేశారు. త్వ‌ర‌లోనే `డ్రైవింగ్ లైసెన్స్` రీమేక్ కి సంబంధించి మ‌రింత స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

Also read:  సీతారామ‌శాస్త్రి చేతిరాత‌.. 'కంచె'లోని పాట‌!

కాగా, ప్ర‌స్తుతం వెంకీ చేతిలో `ఎఫ్ 3` ఉండ‌గా.. ర‌వితేజ చేతిలో `ఖిలాడి`, `రామారావు ఆన్ డ్యూటీ`, `ధ‌మాకా`, `రావ‌ణాసుర‌`, `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` వంటి చిత్రాలున్నాయి.  

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com