ఇద్దరు నాయికలతో తారక్ రొమాన్స్!
on Apr 21, 2021

'జనతా గ్యారేజ్' (2016) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు ఈ క్రేజీ ప్రాజెక్టుని సంయుక్తంగా నిర్మించనున్నాయి. జూన్ నుండి ఈ భారీ బడ్జెట్ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుంది.
ఇదిలా ఉంటే.. 'ఎన్టీఆర్ 30'లో కథానుసారం ఇద్దరు హీరోయిన్లకు స్థానముందట. ఇప్పటికే ఓ నాయిక పాత్ర కోసం కియారా అద్వానీతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. సెకండ్ లీడ్ కోసం అన్వేషణ సాగుతోందని బజ్. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. తారక్ - శివ గత చిత్రం 'జనతా గ్యారేజ్' కూడా ఇద్దరు నాయికల సినిమానే. అందులో సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించారు. 'ఎన్టీఆర్ 30'లోనూ అదే శైలి కొనసాగుతుండడం విశేషం. కాగా, 2022 ఏప్రిల్ 29న 'ఎన్టీఆర్ 30' రిలీజ్ కానుంది.
కాగా, తారక్ తాజా చిత్రం 'ఆర్ ఆర్ ఆర్' విజయదశమి కానుకగా అక్టోబర్ 13న విడుదల కానుండగా.. కొరటాల శివ కొత్త చిత్రం 'ఆచార్య' ఆలోపే థియేటర్స్ లోకి రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



