పవన్, త్రివిక్రమ్‌ల సైలెంట్ వెనుక సీన్ ఏంటీ..?
on Jun 8, 2017
.jpg)
మామూలుగా ఒక స్టార్ సినిమా సెట్ మీద ఉందంటే దానికి ఉండే బజ్ వేరు. ముఖ్యంగా సినిమా స్టోరీ ఏంటీ..తమ ఫేవరేట్ స్టార్ హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ ఇలా అన్నింటిని ఫాలో అవుతుంటారు ఫ్యాన్స్. మరి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి సూపర్‌స్టార్ సినిమా చేస్తుంటే దానికి ఉండే ఇంపార్టెన్సే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అభిమానులు, ప్రేక్షకులు ఎంటైర్ మీడియా అంతా ఆ వైపే ఫోకస్ చేస్తుంది. అలాంటిది త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ ఒక సినిమా చేస్తున్నాడు..దానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ విషయం ఎంత మందికి తెలుసు అంటే..క్వశ్చన్ మార్కే..!.
త్రివిక్రమ్ కానీ పవన్ కానీ సినిమా చేస్తుంటే దానికి సంబంధించిన న్యూస్‌ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు మాత్రం ఎందుకింత సైలెంట్ మెయింటెన్ చేస్తున్నారు అంటే దానికి ఒక్కటే రీజన్. వరుసగా రెండు చిత్రాలు ఫ్లాప్ కావడంతో తాను తరువాత తీయబోయే సినిమాపై హైప్ లేకుండా చేయాలని పవన్ భావిస్తున్నాడట. అందుకు తగ్గట్టే దర్శకుడు త్రివిక్రమ్ కూడా షూటింగ్ చాలా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నాడట. సో..ఫ్యాన్స్ సినిమాలో ఉన్న విషయం తెలియాలంటే టీజర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



