పెళ్ళికూతురు కానున్న త్రిష...పెళ్ళికొడుకు ఎవరో తెలుసా?
on Sep 20, 2023
1999లో ప్రశాంత్, సిమ్రాన్ జంటగా నటించిన ‘జోడి’ చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్‌గా నటించడం ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన త్రిష 2002లో సూర్య హీరోగా నటించిన ‘మౌనం పేసియాదే’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో ప్రముఖ హీరోలందరి సరసన హీరోయిన్‌గా నటించి హీరోయిన్‌గా ఓ స్పెషల్ క్రేజ్‌ను సంపాదించుకుంది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి 21 సంవత్సరాలు పూర్తవుతున్నా ఆమె ఛరిష్మా ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. ఇవి తమిళ్, మలయాళంలో రూపొందుతున్నాయి. అందం, అభినయం కలగలిసిన త్రిష ఇప్పటికీ కుర్రకారును మెస్మరైజ్ చేస్తోందంటే మామూలు విషయం కాదు.
ఇదిలా ఉంటే, త్రిష త్వరలోనే పెళ్ళికూతురు కాబోతోందన్న వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఓ మలయాళ చిత్ర నిర్మాతను త్రిష వివాహం చేసుకోబోతోందని తెలుస్తోంది. ఓ మలయాళ సినిమా షూటింగ్‌లో ఆ చిత్ర నిర్మాత, త్రిష ప్రేమలో పడ్డారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో త్రిష ఎంగేజ్‌మెంట్ ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో జరిగిన విషయం తెలిసిందే. కొన్ని కారణాల వల్ల అది క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న ఈ వార్తలో ఎంత నిజముందనేది అధికారిక ప్రకటన వస్తేనేగానీ తెలీదు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
