లవర్ కోసం ఆ తండ్రీ కొడుకులు తిట్టుకున్నారట..!
on May 26, 2016

ఒక స్టార్ హీరో కొడుకు. మరో స్టార్ హీరోయిన్ ను ప్రేమించాడు. అయితే తండ్రికి ఆ లవ్ ఎఫైర్ నచ్చలేదు. వద్దని కొడుక్కి నచ్చ చెప్పాడు. కానీ కొడుకు మాత్రం వినలేదు. తనకు ఎంతో ఇష్టమైన ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని మొండి పట్టు పట్టాడు. ఇదే విషయమై ఇద్దరికీ గొడవ చిలికి చిలికి పెద్దదైంది. ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. ఆ స్టార్ హీరోది కూడా లవ్ మ్యారేజే. అయితే కొడుకు లవ్ చేసి పెళ్లిచేసుకోవడానికి ఇష్టమే అయినా, ఆ హీరోయిన్ మాత్రం వద్దని, గతంలో ఒక అఫైర్ కూడా ఉన్న అమ్మాయితో నీకు ప్రేమ వద్దని కొడుకుని వారిస్తున్నాడట. ఎప్పుడూ కలిసి మెలిసి ఉండే ఆ కుటుంబంలో, తండ్రీ కొడుకులిద్దరూ గొడవ పడటం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇప్పటికే చాలా కాలంగా ఇంట్లో వాళ్ల సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరోగారి పెళ్లికి ఇంట్లో వాళ్ల నుంచి మాత్రం అంగీకారం రావట్లేదు. మరి తండ్రి తన మాట గెలుస్తాడో, లేక కొడుకు తన ప్రేమను గెలుస్తాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



