Home

»

Gossips

భయం భయం: రూట్ మార్చిన మేర్లపాక గాంధీ.. తాప్సీతో కలిసి రచ్చ రచ్చ.!

Aug 29, 2026 6:43PM

మొదట్లో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' లాంటి కామెడీ సినిమాలతో అలరించిన దర్శకుడు మేర్లపాక గాంధీ, ఇటీవల 'కొరియన్ కనకరాజు' అనే హారర్ కామెడీ ఫిల్మ్ తో ఆకట్టుకున్నారు. అయితే తన నెక్స్ట్ మూవీ కోసం కంప్లీట్ రూట్ మార్చబోతున్నారు. కామెడీ పక్కన పెట్టి, ప్రేక్షకులను థియేటర్లలో సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే ఒక మైండ్ బ్లోయింగ్ సీరియస్ హారర్ కథను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో ప్రముఖ హీరోయిన్‌ తాప్సీ పన్ను లీడ్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

తాప్సీ గతంలో 'ఆనందో బ్రహ్మ' లాంటి హార్రర్ కామెడీతో నవ్వించి భయపెట్టారు. కానీ ఈసారి కాన్సెప్ట్ పూర్తిగా వేరు. ఇది కామెడీ కాంబినేషన్ అసలే కాదు.. పక్కా డార్క్, సీరియస్ అండ్ ఇంటెన్స్ హారర్ ఫిల్మ్ అని సమాచారం. దర్శకుడు మేర్లపాక గాంధీ రాసుకున్న ఈ స్క్రిప్ట్‌లో ఉండే సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ తాప్సీని బాగా ఆకట్టుకున్నాయట. కథ వినగానే తాప్సీ ఎంతో ఎక్సైట్ అయి వెంటనే ప్రాజెక్ట్‌కి ఒకే చెప్పేశారనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక వైపు కంటెంట్ బేస్డ్ రోల్స్ ఎంచుకునే తాప్సీ, మరోవైపు డిఫరెంట్ టేకింగ్ ఉన్న గాంధీ జతకడితే బాక్సాఫీస్ వద్ద విజిల్స్ పడాల్సిందే.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన  అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

 

 

 

[Merlapaka Gandhi, Taapsee Pannu, Horror Film, Korean Kanakaraju, Telugu Horror Movie, Telugu Cinema, Tollywood, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com