సుకుమార్ వల్ల తడిసి మోపెడయ్యింది..!!
on Feb 9, 2018
.jpg)
సినిమా బడ్జెట్‌లు ఒకప్పటితో పోలిస్తే నానాటికి పెరిగిపోతున్నాయి.. హీరోలు, డైరెక్టర్ల రెమ్యూనరేషన్లు పెరిగిపోవడంతో సినిమా నిర్మాణ వ్యయం పరిమితులు దాటిపోతోంది. పూర్తి బడ్జెట్‌లో సినిమా కోసం ఖర్చు చేసేది 20 శాతం మాత్రమే కాగా.. మిగతా మొత్తం పారితోషికాలకే వెళ్లిపోతుంది. ఇక్కడ ఖర్చు తప్ప సినిమాలో క్వాలిటీ పెరగటం లేదు. డిజిటల్ యుగంలో రీల్స్ వృథా అన్న ప్రశ్నే రాదు. కానీ సెట్టింగ్‌లు, భారీ క్యాస్టింగ్ కారణంగా నిర్మాతలకు తలబొప్పి కడుతోంది. ఇక రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రంగస్థలానికి అనుకున్న బడ్జెట్ కంటే 30 శాతం అదనంగా ఖర్చైనట్లు ఫిలింనగర్ టాక్. షూటింగ్ వాయిదాలు పడటం.. షెడ్యూల్స్ ఎక్కువగా సాగటంతో.. పాటు రాజమహేంద్రవరంలోని నాచురల్ లొకేషన్లలో షూట్ చేయాల్సిన సన్నివేశాల కోసం.. హైదరాబాద్‌లో భారీ సెట్ వేయడంతో బడ్జెట్ అదుపు తప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి లాస్ట్ ఇయర్ నవంబర్‌లో రావాల్సిన సినిమా.. ఈ ఏడాది మార్చి 30కి షిఫ్ట్ అయ్యింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



