కృష్ణ బర్త్ డే స్పెషల్ గా `#SSMB 28`!?
on Jul 13, 2022

తన తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. తన సినిమాల తాలూకు ప్రచార చిత్రాలు విడుదల చేయడం అన్నది సూపర్ స్టార్ మహేశ్ బాబుకి ఆనవాయితీగా మారింది. అయితే, జస్ట్ ఫర్ ఎ ఛేంజ్ అన్నట్లుగా.. మొదటిసారిగా కృష్ణ బర్త్ డే కి కొత్త సినిమాని రిలీజ్ చేసే ప్లాన్ లో మహేశ్ బాబు ఉన్నట్లు బజ్.
ఆ వివరాల్లోకి వెళితే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో `అతడు`, `ఖలేజా` అనంతరం మహేశ్ బాబు మరో మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. బుట్టబొమ్మ పూజా హెగ్డే కథానాయికగా నటించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనుండగా.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ స్వరాలు సమకూర్చనున్నాడు. ఇదిలా ఉంటే, మహేశ్ బర్త్ డే స్పెషల్ గా ఆగస్టు 9 నుంచి `#SSMB 28` రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోందట. అంతేకాదు.. కృష్ణ బర్త్ డే స్పెషల్ గా 2023 మే 31న సినిమాని జనం ముందుకు తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయట. మరి.. ఫస్ట్ టైమ్ కృష్ణ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ కానున్న తన చిత్రంతో మహేశ్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



