అందుకు ఒప్పుకోపోతే.. ఇబ్బందులే!
on Aug 18, 2017

‘కాస్టింగ్ కౌచ్’ అంటే... పాత్రల కోసం పడక గదికి రమ్మనడం... ఈ వ్యవహారంపై హీరోయిన్లు ఈ మధ్య బోల్డ్ గా స్పందించేస్తున్నారు. ఆ మధ్య ఓ కన్నడ నటి ఈ విషయంపై తెలుగు చిత్ర పరిశ్రమను దుయ్యబట్టిన విషయం తెలిసిందే. రీసెంట్ గా శ్రద్ధాదాస్ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. తనక్కూడా అలాంటి అనుభవాలున్నాయని మీడియా సాక్షిగా చెప్పింది.
‘కెరీర్ తొలినాళ్లలో నాకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయ్. పాత్ర కోసం పడక గదికి రమ్మన్న వాళ్లు చాలామంది ఉన్నారు. అయితే.. నేనెప్పుడూ దిగజారలేదూ, ఆత్మవంచన చేసుకోలేదు. నిర్మొహమాటంగా ‘నో’ చెప్పేసేదాన్ని. తత్ఫలితంగా చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాను. కొందరైతే... నన్ను సినిమా నుంచి తప్పించారు. ఇంకొందరు నా పాత్ర నిడివిని తగ్గించారు. కొందరైతే నా పాత్రను కనపడకుండా చేశారు. అయినా... నేను లొంగలేదు. ఓ విధంగా అనుకున్న స్థాయిలో నాకు పేరు రాకపోవడానికి ఇది కూడా ఓ కారణమే. ఈ విషయంలో బాధ పడను. మనకూ టైమ్ వస్తుంది. నా టాలెంటే నాకు శ్రీరామరక్ష’ అని చెప్పుకొచ్చింది శ్రద్ధాదాస్.
మిమ్మల్ని ఆ విధంగా ఇబ్బందిపెట్టిన వారు తెలుగు పరిశ్రమకు చెందినవారా? లేక ఇతరులా? అనడిగితే.. ‘ కాస్టింగ్ కౌచ్.. కేవలం ఒక పరిశ్రమకే పరిమితమైనది కాదు. సినిమా ఉన్న ప్రతి చోటా ఈ జాడ్యం ఉంది. ఆడవాళ్లు ఇక్కడ లౌక్యంగా నడుచుకోవాలి. లేకపోతే అంతే సంగతులు. ఇక వాళ్లెవరో ఇక్కడ అప్రస్తుతం’ అని సింపుల్ గా చెప్పేసింది శ్రద్ధా.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



