సంపూ కలెక్షన్లతో చంపేస్తున్నాడుగా!
on Jun 5, 2015
.jpg)
బర్నింగ్ స్టార్‌నంటూ సెల్యులాయిడ్‌పై సెన్సేషన్ సృష్టిస్తున్నాడు సంపూర్ణేష్ బాబు. 'హృదయకాలేయం'తో సిల్వర్‌స్క్రీన్‌పై ఫస్ట్‌టైమ్ కామెడీ హీరోగా దర్శనమిచ్చిన సంపూ.. తాజాగా 'సింగం 123' చిత్రంతో మరోసారి తన ఫ్యాన్స్ ముందుకొచ్చాడు. ఈ సినిమాని కథానాయకుడు మంచు విష్ణు నిర్మించడం ఓ విశేషమైతే.. ఆయనే కథ, స్క్రీన్‌ప్లే అందించడం మరో విశేషం. ఇదిలా ఉంటే.. నేడు (శుక్రవారం) ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ సినిమా.. టాక్ విషయంలో ఎలా ఉన్నా కలెక్షన్ల విషయంలో మాత్రం మంచి మార్కులే తెచ్చుకుంటోంది. హిట్ రేంజ్‌కి సినిమా వెళుతుందో లేదో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే.. తన సినిమా ఏ ఏ థియేటర్లలో హౌస్‌ఫుల్‌తో ప్రదర్శితమవుతుందో సంపూ ట్విట్టర్‌లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ సందడి చేసేస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



