పెళ్లి చీరను చైతూకు తిరిగిచ్చేసిన సమంత!
on Mar 10, 2022

నాగచైతన్య, సమంత ఐదు నెలల క్రితం విడిపోయారు. తాము భార్యాభర్తలుగా విడిపోతున్నట్లు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఆ ఇద్దరూ ప్రకటించినప్పుడు అందరూ షాక్‌కు గురయ్యారు. వారికి అధికారికంగా విడాకులు మంజూరు కావడమే మిగిలుంది. చైతూ హీరోగా నటించిన 'ఏ మాయ చేశావే' సినిమాలో హీరోయిన్‌గా నటించడం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది సమంత. ఆ సినిమా షూటింగ్‌లో ఏర్పడిన సన్నిహితత్వం స్నేహంగా, తర్వాత ప్రేమగా మారడంతో ఇద్దరూ 2017 అక్టోబర్‌లో ఇటు హిందూ, అటు క్రిస్టియన్ సంప్రదాయల ప్రకారం పెళ్లి చేసుకున్నారు.
హిందూ సంప్రదాయబద్ధంగా జరిగిన పెళ్లి వేడుకలో సమంత ధరించిన చీర అప్పట్లో నెట్టింట వైరల్ అయ్యింది. ఆ చీర చైతూ అమ్మమ్మ దగ్గుబాటి రాజేశ్వరి (రామానాయుడు భార్య)ది. చైతూ సెంటిమెంట్ ప్రకారం ఆ చీర ధరించి, పెళ్లి పీటలపై కూర్చుంది సమంత. పాత చీరను రీడిజైన్ చేయించి ఆమె ధరించిందనీ, దాని కోసం రూ. 40 లక్షల వరకూ ఖర్చయ్యిందనీ ప్రచారంలోకి వచ్చింది.
కాగా.. ఇప్పటిదాకా ఆ చీర సమంత దగ్గరే ఉండగా, ఇప్పుడు ఆ చీరను ఆమె చైతన్యకు తిరిగి ఇచ్చేసిందనే ప్రచారం సోషల్ మీడియాలో వ్యాప్తిలోకి వచ్చింది. చైతూకు సంబంధించిన అన్ని జ్ఞాపకాలనూ వదిలించుకొనే క్రమంలోనే ఆ పెళ్లిచీరను కూడా ఆమె చైతూకు పంపించేసిందని అంటున్నారు. ఈ ప్రచారం నిజమా, కాదా అనేది వెల్లడి కావాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



