నాగార్జున చైతూని కాపాడలేకపోయాడా..?
on Feb 3, 2017
ప్రేమించిన అమ్మాయితో కొడుకు పెళ్లి జరిపించడం..చాలా కొద్దిమంది తండ్రులు మాత్రం తమ కొడుకులకి ఇలాంటి బహుమతులిస్తారు. అలాంటి వారిలో ఒకరు కింగ్ నాగార్జున. నాగచైతన్య, సమంతలు ఎంతో కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. దీనిని తండ్రికి చెప్పడం ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం..రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసేయడంతో చైతూ ఫుల్ హ్యాపీ..కొడుకు అడిగి అడక్కుండానే ఇంత చేసిన నాగ్ ఒక విషయంలో మాత్రం నాగచైతన్యని కాపాడలేకపోయాడట.
అదేంటంటే.. చైతూ, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో కంటెంట్ బాగున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా చైతూ కెరీర్లోనే బిగ్గిస్ట్ హిట్‌గా నిలుస్తుందని నాగ్ భావించారట..కానీ సరిగ్గా ఆ టైంలో నోట్ల రద్దు ఉండటంతో ఆ ప్రాభవం కలెక్షన్స్‌పై పడిందని..రాంగ్ టైంలో రిలీజ్ చేయడమే అందుకు కారణమని నిర్మాతగా, బిజినెస్ మ్యాన్‌గా ఇంత అనుభవమున్నా చైతూని ఈ విషయంలో కాపాడలేకపోయానని ఇక మీదట అలా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పారు.