సల్లూభాయ్ నిశ్చితార్ధం అయిందా?పెళ్లి కొడుకు అవ్వబోతున్నాడా?
on Oct 19, 2015

బాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ ఎవరంటే కొంచం కూడా తడబడకుండా చెప్పే పేరు సల్మాన్ ఖాన్. ఈ కండలవీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లి సంగతేమో కాని ప్రేమ వ్యవహారాలు మాత్రం బాగానే నడిపాడు. బాలీవుడ్ లో అగ్రహీరోయిన్ లు ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్, సంగీతీ బిజ్లానీ ఇప్పుడు లేటెస్ట్ గా రొమానియన్ తార లులియా వాంతర్ లతో ప్రేమాయణాలు నడిపి ఎప్పుడూ వార్తల్లో చక్కర్లు కొడుతూనే ఉండేవాడు. అయితే ఇప్పుడు సల్లూభాయ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్త బాలీవుడ్ లో హల్ చల్ చేస్తుంది. గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నా లులియానే పెళ్లి చేసుకోబోతున్నట్టు.. తాజాగా వారిద్దరికి నిశ్చితార్ధం కూడా జరిగినట్టు తెలుస్తోంది. అంతేకాదు వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటారని కూడా లులియా వర్గాల ద్వారా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి సల్లూభాయ్ పెళ్లి విషయంలో ఎప్పుడూ ఏదో పుకారు వస్తూనే ఉంటుంది.. వాటిలో కొత్తేమి లేదు. మరి ఈ విషయం ఎంత వరకూ నిజమో.. లేకపోతే వట్టి పుకారో తెలియాలంటే సల్మాన్ పెళ్లి వరకూ ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



