ఓహో! ఇందుకా దీపికా రణ్‌వీర్‌కి దూరంగా ఉంటుంది
on Mar 2, 2017
ప్రేమ కోసం యుద్దాలు జరిగిన సందర్భాలు కోకొల్లలు. కానీ, ఇప్పుడు ప్రేమకి అర్ధమే మారిపోయింది. ఇక సినిమా ఇండస్ట్రీ లో అయితే, ప్రేమ ఎప్పుడు పుడుతుందో, ఇద్దరి మధ్య బ్రేక్-అప్ ఎప్పుడు అవుతుందో చెప్పడం చాలా కష్టం. అబ్బా, ఎక్కడ చుసిన వాళ్లిద్దరూ అన్యోన్యంగా కనిపిస్తున్నారే, ఇంక పెళ్లి చేసుకుంటారేమో అని జనాలు అనుకునే లోపే తెగదెంపులు చేసుకుంటున్నారు. బాలీవుడ్ లో పరిస్థితి అయితే ఇంక చెప్పక్కర్లేదు.
బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే, తన రాంలీలా సినిమా సహ నటుడు రణ్వీర్ సింగ్ తో కొన్ని ఏళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తోంది. సినిమాల్లోనే కాదు, బయట కూడా రొమాన్స్ చేస్తూ మీడియా కంటపడ్డారు వీళ్లిద్దరు. అయితే, బాలీవుడ్ మీడియా వీళ్లిద్దరు ఇంతకు ముందులా క్లోజ్ గా ఉండట్లేదు అని, దీపికా రణ్వీర్ కి ఆల్రెడీ బ్రేక్-అప్ చెప్పేసింది అని ప్రచారం చేస్తుంది.
దీపికా హాలీవుడ్ లో బిజీ గా ఉండడమే ఇందుకు కారణమని తెలిసింది. వరుస సినిమాలు, యాడ్ షూటింగ్స్ తో బిజీ గా ఉన్న, దీపికా కి రణ్వీర్ తో గడపడం కుదరట్లేదట. అంతేకాకుండా, ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటే, కెరీర్ క్లోజ్ అయ్యే ప్రమాదం ఉందని ఆలోచిస్తుందని బాలీవుడ్ కోడై కూస్తుంది. ఈ విషయాలు నిజమా కాదా తెలియాలంటే, వీళ్ళద్దరు ప్రస్తుతం కలిసి నటిస్తున్న పద్మావతి విడుదల వరకు వేచి చూడాల్సిందే. ఒక వేళ, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వకపోతే, వాళ్ళ బ్రేక్-అప్ వార్తల్లో వాస్తవం ఉందని డిసైడ్ అయిపోవచ్చు.