'బాహుబలి' 2 అంతకు మించి.. !!
on Jul 14, 2015
.jpg)
బాహుబలి రికార్డుల వేట ఇంకా ఆగకముందే..'బాహుబలి' 2కి సంబంధించిన వార్తలు ఇండస్ట్రీ వర్గాలలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రభాస్ కండలు తిరిగిన శరీరం.. బారీ యుద్ధ సన్నివేశాలు.. రాజమౌళి మార్క్ ఎమోషన్స్.. అన్నీ సెకెండ్ పార్ట్‌లో వున్నాయన్న ప్రచారం నేపథ్యంలో మళ్ళీ హైప్ క్రమక్రమంగా పెరిగిపోతోంది. తెలుగు తెరపై ఆషామాషీ ప్రయోగం కాదిది. ఒకే కథని రెండు పార్టులుగా సినిమా తీసి, దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత (ఏడాది తర్వాతే బాహుబలి సెకెండ్ పార్ట్ వచ్చే అవకాశం ఉ౦ది) రావడం అంటే, అది చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే. సినిమాని తెరకెక్కించడం, దానిపై హైప్ పెంచడం, ఆ హైప్‌ని తట్టుకునేలా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి, వారి మన్ననలు అందుకోవడానికి ఎంతో ధీరత్వం కావాలి. ఆ ధీరత్వం రాజమౌళిలో వుందన్న విషయం ఇప్పటికే చాలా సినిమాల విషయంలో ప్రూవ్ అయ్యింది. ఇప్పుడిక 'బాహుబలి'2 ను జక్కన్న ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీసుకొస్తాడో వేచి చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



