'మన్మథుడు 2' దర్శకుడితో రష్మిక!!
on Sep 11, 2021

నటుడిగా సినీ పరిశ్రమకు పరిచయమైన రాహుల్ రవీంద్రన్.. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక 2018 లో వచ్చిన 'చిలసౌ' సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన.. మొదటి సినిమాతోనే విజయాన్ని అందుకున్నారు. అయితే ఆ తర్వాత 'మన్మథుడు 2' సినిమాతో డిజాస్టర్ ను మూటకట్టుకున్నారు. ఇదిలా ఉంటే రాహుల్ దర్శకుడిగా తన మూడో సినిమాను గీతా ఆర్ట్స్ లో చేయనున్నారని, ఈ మూవీలో రష్మికా మందన్న లీడ్ రోల్ లో నటించనుందని టాక్ వినిపిస్తోంది.
నాగార్జునతో చేసిన 'మన్మథుడు 2' తర్వాత దర్శకుడిగా రాహుల్ కి అవకాశాలు రాలేదు. దీంతో చాలా కాలంగా ఆయన కథలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల ఓ లేడీ ఓరియెంటెడ్ కథను రెడీ చేసుకుని గీతా ఆర్ట్స్ లో వినిపించినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఆ కథకి గీతా ఆర్ట్స్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ కథకు రష్మిక అయితే కరెక్టుగా సరిపోతుందని భావించిన రాహుల్.. ఆమెను సంప్రదించడం కూడా జరిగిపోయిందని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ చేయడానికి రష్మిక ఓకే చెప్పినట్లు సమాచారం.
కాగా గతంలో గీతా ఆర్ట్స్ లో 'గీత గోవిందం' అనే సినిమాలో నటించింది రష్మిక. ఈ సినిమాతోనే స్టార్ డమ్ తెచ్చుకున్న రష్మిక ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. మరి ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ మూవీతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



