Home

»

Gossips

అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి షాక్: 2028కి వాయిదా పడిన 'రాకా'.!

Sep 12, 2026 3:54PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న 'రాకా' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే 'పుష్ప' లాంటి ఆల్-టైమ్ బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ చేస్తోన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇది. అసలు ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం.. ఈ ఏడాది దసరా నాటికే ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి, 2027 క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. షూటింగ్ షెడ్యూల్స్‌లో తీవ్రమైన జాప్యం జరగడంతో, 'రాకా' మూవీ రిలీజ్ ఏకంగా 2028కి వాయిదా పడిందని సమాచారం.

లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం... ఈ సినిమా చిత్రీకరణ ఇప్పుడు 2027 మార్చి లేదా ఏప్రిల్ వరకు కొనసాగే అవకాశం ఉంది. డైరెక్టర్ అట్లీ తన సినిమాల్లో విజువల్స్, యాక్షన్ సీక్వెన్సెస్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాడు. 'రాకా'లో భారీ గ్రాఫిక్స్ వర్క్ ఉండటంతో, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ఆయనకు చాలా ఎక్కువ సమయం కావాల్సి వస్తోంది. క్వాలిటీ విషయంలో ఎలాంటి లోటు ఉండకూడదనే ఉద్దేశంతోనే 2027 క్రిస్మస్ రేస్ నుంచి తప్పుకోవాలని టీమ్ నిర్ణయించుకుందని తెలుస్తోంది.

ప్రస్తుతానికి 2028 రిపబ్లిక్ డే కానుకగా ఈ విజువల్ వండర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఆ డెడ్‌లైన్ కూడా మిస్ అయితే, 2028 సమ్మర్ లో ఈ సినిమాను థియేటర్లలోకి దించడానికి ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ పూర్తిగా పూర్తయిన తర్వాతే అఫీషియల్ రిలీజ్ డేట్‌ను లాక్ చేసి అనౌన్స్ చేయనున్నారట.

సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో కాస్టింగ్ కూడా అదే స్థాయిలో ఉంది. ఈ చిత్రంలో దీపికా పడుకోణె, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

వాయిదా పడిందన్న వార్త ఫ్యాన్స్‌కు కాస్త నిరాశ కలిగించినా.. అవుట్‌పుట్ మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా ఉండబోతోందట. 

 

 

 

[Raaka Postponed, Allu Arjun, Raaka Movie, Raaka 2028 Release, Director Atlee, Allu Arjun, Telugu Film News, Tollywood News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com