Home

»

Gossips

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ ఫిక్స్: సమంత భర్తతో సూపర్‌స్టార్ బిగ్ ప్రాజెక్ట్.!

Sep 10, 2026 11:08AM

సూపర్‌స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో 'వారణాసి' మూవీ చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తయింది. వారణాసి మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ ప్రాజెక్ట్ తర్వాత మహేష్ ఏ డైరెక్టర్ తో చేతులు కలుపుతారు అనేది ఆసక్తికరంగా మారింది. సందీప్ రెడ్డి వంగా సహా ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లు వినిపించాయి. ఇప్పుడు అనూహ్యంగా దర్శక ద్వయం రాజ్-డీకే తెరపైకి వచ్చారు. 

వారణాసి మూవీ షూటింగ్ పనులు ముగింపు దశకు చేరుకోవడంతో.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం మహేష్ ఇప్పటి నుంచే కథలను వినడం మొదలుపెట్టారని అంటున్నారు. ఈ క్రమంలోనే 'ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తో సంచలనం సృష్టించిన మేకర్స్ రాజ్ నిడిమోరు, కృష్ణ డీకే ఇటీవల మహేష్ బాబును కలసి ఒక సాలిడ్ స్టోరీ లైన్ నరేట్ చేశారట. ఈ దర్శక ద్వయంలో రాజ్ నిడిమోరు ఎవరో కాదు.. స్టార్ హీరోయిన్ సమంత భర్త కావడం విశేషం.

రాజ్ అండ్ డీకే ప్రెజెంటేషన్ అనగానే.. స్టైలిష్ విజువల్స్, డార్క్ హ్యూమర్, రా యాక్షన్, సీటు అంచున కూర్చోబెట్టే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ గుర్తుకొస్తాయి. ఇప్పటివరకు తెలుగులో మహేష్ బాబు ఎన్నో మాస్, క్లాస్, యాక్షన్ రోల్స్ చేశారు. కానీ, రాజ్-డీకే మార్క్ రా అండ్ రియలిస్టిక్ డార్క్ హ్యూమర్ యాక్షన్ థ్రిల్లర్‌లో మహేష్ బాబును ఊహించుకుంటేనే ఫ్యాన్స్‌కి పూనకాలు వస్తున్నాయి.

రాజ్-డీకే చెప్పిన డిఫరెంట్ అండ్ నోవెల్ కాన్సెప్ట్‌కి మహేష్ పాజిటివ్‌గా స్పందించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రైమరీ డిస్కషన్స్ జరుగుతున్నాయట. ఒకవేళ ఈ కాంబినేషన్ అధికారికంగా పట్టాలెక్కితే.. ఇది మహేష్ బాబు కెరీర్‌లో 30వ సినిమాగా రాబోతోంది.

గతంలో కూడా రాజ్-డీకే, మహేష్ బాబు కాంబో గురించి పలు వార్తలు వినిపించినా, ఈసారి మాత్రం స్టోరీ డిస్కషన్స్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లడం విశేషం. రాజమౌళితో గ్లోబల్ ప్రాజెక్ట్ ముగిశాక, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న మేకర్స్‌తో మహేష్ జతకడితే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు బద్దలవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

 

 

 

[Mahesh Babu, Varanasi Movie, SS Rajamouli, Raj and DK, SSMB30 Movie, Raj Nidimoru, Telugu Film News, Telugu Movie News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com