Home

»

Gossips

ఫౌజీ కొత్త రిలీజ్ డేట్: ఊహించని డేట్ లాక్ చేసిన మేకర్స్.!

Sep 15, 2026 3:32PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ 'ఫౌజీ'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 3, 2026న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడం వంటి కారణాలతో 'ఫౌజీ' వాయిదా పడినట్లు కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

'ఫౌజీ' వచ్చే ఏడాది జనవరిలో విడుదలవుతుందని, కాదు మార్చిలో అని రకరకాల న్యూస్ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ రెండూ కాకుండా ఫిబ్రవరిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. జనవరిలో సంక్రాంతి సీజన్ పై ఇప్పటికే పలు సినిమాలు కర్చీఫ్ వేశాయి. మార్చి లోనేమో ప్రభాస్ మరో మూవీ 'స్పిరిట్' ఉంది. అందుకే ఫిబ్రవరి మంచి ఆప్షన్ అని భావిస్తున్నారట.

'ఫౌజీ' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. ప్రస్తుతం మేకర్స్, కొత్త రిలీజ్ గురించి నెట్ ఫ్లిక్స్ తో చర్చలు జరుపుతున్నారట. డేట్ ఫైనల్ అయితే, త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.

 

 

 

[Prabhas Fauzi Movie, Fauzi New Release Date, Fauzi February Release, Fauzi Movie 2027, Fauzi vs Spirit, Prabhas, Hanu Raghavapudi, Telugu Film News, Telugu News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com