Home

»

Gossips

Allu arjun: మాటలు మారాయి.. రాకా తాజా న్యూస్ నిజమేనా!

May 07, 2026


 పుష్ప సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ కి కట్ అవుట్ ని పెంచుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)ప్రెజెంట్ 'రాకా'(Raaka)తో ముస్తాబు చేస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ తో అయితే చిన్నప్పుడు మనం చెప్పుకొని మర్చిపోయిన చందమామ కథల్ని రాకా కథ గురించి చెప్పుకునేలా చేస్తుంది.  ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. రీసెంట్ గా రాకా గురించిన ఒక ఫ్రెష్ రూమర్ నన్నెవరు జడ్జ్ చేయాల్సిన అవసరం లేదనే రీతిలో చక్కర్లు కొడుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం

 తన బర్త్ డే సందర్భంగా సంవత్సరానికి రెండు చిత్రాలని చేస్తాన ని అల్లు అర్జున్  ప్రకటించాడు. ఈ నేపధ్యంలో రాకా కి ఎక్కువ  టైంని స్పెండ్ చేయకూడదని అల్లు అర్జున్ ఫిక్స్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంతో  వచ్చే ఏడాది వేసవి కంటే ముందే రాకా రావచ్చనే మాటలు వినపడుతున్నాయి.లోకేష్ కనగరాజ్ తో కూడా అల్లు అర్జున్  సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో తాను ఇచ్చిన మాట ప్రకారం రెండు సినిమాలు రావాలంటే రాకా ని త్వరగా ఫినిష్ చెయ్యాలని అనుకుంటున్నాడనే  రూమర్స్ మొదలయ్యాయి.


Also read: VIjay: పీచే ముడ్.. విజయ్ పై ప్రకాష్ రాజ్ ఆసక్తికర ట్వీట్  

రాకా మాత్రం భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత హై బడ్జెట్ తో తెరకెక్కుతుంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉండనున్నాయి. ఏ విషయంలోను అట్లీ(Atlee)కాంప్రమైజ్ కావడం లేదు. దీపికా పదుకునే పై కొన్ని కీలక సన్నివేశాలని కూడా చిత్రీకరణ జరుపుకున్న రాకాని సన్ పిక్చర్స్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు.  


 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com