
కొన్నేళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరో నితిన్ (Nithiin), వరుస క్రేజీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నాడు. ఇటీవల సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఒక సినిమా స్టార్ట్ చేశాడు. దర్శక ద్వయం నారి సిరిసవాడ, సోమశేఖర్ టి తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పుడు 'జాతి రత్నాలు' ఫేమ్ దర్శకుడు అనుదీప్ కేవీ(Anudeep KV)తో నితిన్ జతకట్టబోతున్నట్లు తెలుస్తోంది.
దర్శకుడు అనుదీప్ తనదైన శైలిలో సిల్లీ అండ్ హిలేరియస్ కామెడీని పండించడంలో దిట్ట. నితిన్ కూడా 'భీష్మ' వంటి సినిమాలతో తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుండటంతో వినోదం రెట్టింపు అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ' (People Media Factory) నిర్మించనుందని సమాచారం.
అనుదీప్ ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేశాడని, నితిన్ బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా కథను సిద్ధం చేశాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశముంది.
అనుదీప్ గత చిత్రం 'ఫంకీ' నిరాశపరిచింది. ఇప్పుడు ఈ సినిమాతో తాను హిట్ కొట్టడమే కాకుండా, నితిన్ ను కూడా సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాడేమో చూడాలి.





