Home

»

Gossips

Balakrishna: ముఖ్యమంత్రిగా నందమూరి బాలకృష్ణ!

May 02, 2026

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్ లో భారీ సినిమా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. SLV సినిమాస్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. బాలకృష్ణ నటిస్తున్న 112వ సినిమా ఇది. 'NBK112' వర్కింగ్ టైటిల్ రూపొందుతోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇందులో బాలయ్య ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం.

కొరటాల మార్క్ పొలిటికల్ డ్రామా
దర్శకుడు కొరటాల శివ తన సినిమాల్లో సామాజిక బాధ్యతతో కూడిన అంశాలను చర్చిస్తూనే, కమర్షియల్ ఎలిమెంట్స్‌ను అద్భుతంగా జోడిస్తారు. గతంలో 'భరత్ అనే నేను' సినిమాలో మహేష్ బాబును ముఖ్యమంత్రిగా చూపించి మెప్పించిన కొరటాల, ఇప్పుడు బాలయ్య కోసం అంతకు మించిన పవర్‌ఫుల్ పొలిటికల్ డ్రామాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 

"పవర్ మీట్స్ పర్పస్.. మాస్ బికమ్స్ ఏ మూవ్‌మెంట్" (Power Meets Purpose.. Mass Becomes A Movement) అనే క్యాప్షన్‌తో విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్ సినిమా మూడ్‌ను క్లియర్ గా ఎలివేట్ చేస్తోంది. ఈ కథలో బాలయ్య మార్క్ డైలాగులు, కొరటాల మార్క్ మేకింగ్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ముఖ్యమంత్రిగా నటసింహాం గర్జన
బాలకృష్ణకు రాజకీయ నేపథ్యంలో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో 'అధినాయకుడు' వంటి చిత్రాల్లో రాజకీయ నాయకుడిగా కనిపించినా.. ఇప్పుడు కొరటాల శివ డిజైన్ చేసిన సీఎం పాత్ర చాలా హుందాగా, అదే సమయంలో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా ఉంటుందని టాక్. సమాజంలోని అవినీతిని అంతం చేసే ఒక నిజాయితీ గల నాయకుడిగా బాలయ్య నటన ఈ సినిమాకు హైలైట్ కానుంది అంటున్నారు.

బాలకృష్ణ మాస్ ఇమేజ్, కొరటాల శివ క్లాస్ మేకింగ్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైనట్లే. ముఖ్యంగా ముఖ్యమంత్రి పాత్రలో బాలయ్యను ఊహించుకుంటేనే అభిమానులకు పూనకాలు వస్తాయి అనడంలో సందేహం లేదు.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com