జనగణమన పాడబోతున్న పూరి జగన్నాథ్
on Sep 4, 2023
పూరి జగన్నాథ్ ప్రస్తుతం రామ్ హీరోగా డబుల్ ఇస్మార్ట్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ వైపు అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. తను ఎంతోకాలం నుంచి చెయ్యాలనుకుంటున్న జనగణమన చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఆమధ్య ఈ సినిమా గురించి చాలా వార్తలు వచ్చాయి. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాడు. ఇటీవల విజయ్ దేవరకొండతో చేసిన లైగర్ అందర్నీ నిరాశపరిచింది. ఇప్పుడు తన హోప్స్ అన్నీడబుల్ ఇస్మార్ట్ పైనే పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా పూర్తి కాగానే తన డ్రీమ్ ప్రాజెక్ట్ పై దృష్టి సారించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నాడు పూరి. ఈ సినిమాలో హీరోగా నటింపజేసేందుకు అజయ్ దేవ్ గణ్, జాన్ అబ్రహంలతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఇద్దరిలో ఎవరు ఈ సినిమాకి ఓకే చెబుతారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



