
సూపర్‌స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఆయనతో ఒక్క సినిమానైనా తెరకెక్కించాలని ఇటు టాలీవుడ్ నుంచి అటు బాలీవుడ్ దాకా ఎందరో మేకర్స్ ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఈ లిస్ట్‌లో బాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి చిత్రాలను అందించిన ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ పేరు గట్టిగా వినిపిస్తోంది.
టాలీవుడ్ కి చెందిన ఓ టాప్ హీరోతో పాన్ ఇండియా స్థాయిలో భారీ పీరియాడిక్ ప్రాజెక్ట్ చేయాలని భన్సాలీ చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నారు. గతంలో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో ఆయన చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ రేసులోకి మహేష్ బాబు పేరు వచ్చి చేరింది.
ఫిల్మ్ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. తాజాగా భన్సాలీ స్వయంగా మహేష్ బాబును కలిసి ఓ పవర్ ప్యాక్డ్ కథను వినిపించారట. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా త్వరలోనే పట్టాలెక్కనుందంటూ జోరుగా చర్చ నడుస్తోంది. ఫ్యాన్స్ అయితే ఈ కాంబో నిజమైతే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం పక్కా అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

అయితే, ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’తో ఫుల్ బిజీగా ఉన్నారు. జక్కన్న సినిమా అంటే ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు మహేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై ఎలాంటి అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. ‘వారణాసి’ పూర్తయిన తర్వాతే, భన్సాలీ ప్రాజెక్ట్ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరి భన్సాలీ చెప్పిన కథ మహేష్‌కు నచ్చిందా? రాజమౌళి సినిమా తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ నిజంగానే సెట్ అవుతుందా? లేదా ఇదంతా కేవలం రూమర్‌గానే మిగిలిపోతుందా? అన్న దానిపై రాబోయే రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
[Mahesh Babu Sanjay Leela Bhansali Movie, Mahesh Babu Next Movie, Superstar Mahesh Babu, Sanjay Leela Bhansali, Varanasi Movie, SS Rajamouli, Telugu Movie News, Telugu News, Tollywood]





