పవర్ స్టార్ తో చీవాట్లు తిన్న కెమెడియన్?
on Jul 11, 2017

పవన్ కల్యాణ్ ఎంత ప్రశాంతంగా ఉంటారో... కోపం వస్తే అంత భయకరంగా ఉంటారు. షూటింగ్ టైమ్ లో పవర్ స్టార్ ఆగ్రహానికి గురైన వారు కొందరు లేకపోలేదు. ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ టైమ్ లోఅతిగా ప్రవర్తించిన ఓ కెమెడియన్ ని పవన్ నాలుగు తగిలించినట్లు గతంలో వార్తలొచ్చాయి. అయితే.. అవన్నీ రూమర్లే అని చాలామంది కొట్టి పారేశారు. అయితే... రీసెంట్ గా తివిక్రమ్, పవన్ సినిమా సెట్ లో కూడా అలాంటి ఓ సంఘటనే చోటు చేసుకుందని యూనిట్ సభ్యుల ద్వారా తెలిసింది. వివరాల్లోకెళ్తే...
షూటింగ్ మంచి జోష్ లో సాగుతున్న సమయంలో పవర్ స్టార్ దగ్గరకు ఓ కెమెడియన్ వచ్చాడట. ప్రస్తుతం ఉన్న బిజీ కమెడియన్స్ లో అతను కూడా ఒకడట. వచ్చిన వాడు సైలెంట్ గా కూర్చోక, ‘జనసేన’ పార్టీ గురించిన వివరాలు అడిగాడట.
‘ఇక్కడ అది అప్రస్తుతం కదా.. వదిలేయ్’ అని మంచిగానే చెప్పారట పవన్. కానీ ఆ కమెడియన్ ఊరుకోకుండా... ‘పార్టీ విధానాలేంటి? ఎక్కడ నుంచీ పోటీ చేస్తున్నారు? అన్ని చోట్లా నిలబడతారా? మరి.. ఎలాంటి వారిని తీసుకుంటారు?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడట.. ఇక పవర్ స్టార్ కి అరికాలు నుంచి మండుకొచ్చి.. ఆ కమెడియన్ ని కొట్టినంత పని చేశారట.
‘‘ఎక్కడ ఏం మాట్లాడాలో తెలుసుకో. వద్దు అన్న తర్వాత కూడా అధిక ప్రసంగం దేనికి? ఇడియట్’’ అని చీవాట్లు పెట్టాడట వపన్. ఇక ఆ కమెడియన్ చిన్నగా అక్కడ్నుంచి జారుకున్నాడట. మరి పవన్ తో చతుర్లా...? అమ్మా...?
మరిచిపోయాను... ఆ కెమెడియన్ త్రివిక్రమ్.. ‘అ..ఆ’లో కూడా కీలక పాత్ర పోషించాడట. చెప్పుకోండి చూద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



