పవన్ అంత తీస్కుంటున్నాడా..నిజమేనా..?
on May 19, 2016

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ కంప్లీట్ గా డిఫరెంట్. హిట్స్ వచ్చినా, ఫ్లాపులు వచ్చినా ఆయనకున్న డిమాండ్ కొంచెం కూడా తగ్గకపోవడం ఆయన స్పెషాలిటీ. సర్దార్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత కూడా, పవన్ తర్వాతి సినిమాకు క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. తాజాగా ఆయన స్టామినాకు సంబంధించి ఒక వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. మొన్నీమధ్యే ఎస్ జే సూర్యతో సినిమాను లాంఛనంగా ప్రారంభించాడు పవన్. ఈ సినిమాకోసం ఏకంగా 25 కోట్ల రెమ్యునరేషన్ ను పవన్ తీసుకోబోతున్నాడట. తన స్నేహితుడు శరత్ మరార్ తో పాటు, సంయుక్తంగా పవనే ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయినప్పటికీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం పవన్ ఏమాత్రం తగ్గట్లేదట. అయితే శరత్ మరార్ కూడా పవన్ ఎంత కావాలంటే అంత తీసుకోమని ఓపెన్ ఆఫర్ ఇచ్చేశాడు. అందుక్కారణం లేకపోలేదు. పవన్ సినిమా ఫ్లాప్ అయితేనే 50 కోట్లను సులువుగా దాటేసింది. అదే హిట్టయితే ఇక ఆ స్థాయి వేరే లెవల్లో ఉంటుంది. ఈ నమ్మకమే శరత్ మరార్ కు ధైర్యాన్నిస్తోంది. పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పగల ఖుషీ తర్వాత కాంబినేషన్ కావడంతో, మరో సెన్సేషనల్ హిట్ వస్తుందని ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. స్టోరీ చాలా వైవిధ్యంగా ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎస్ జే సూర్య పవన్ ను ఎలా డీల్ చేస్తాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



