పవన్ కళ్యాణ్ కోసం విజయ్ దేవరకొండ వెనక్కి వెళ్తాడా?
on Dec 28, 2024
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan)నటిస్తున్న ఫస్ట్ చారిత్రాత్మక మూవీ 'హరిహరవీరమల్లు'(hari hara veeramallu).గత కొన్ని రోజుల నుంచి ఏపి లో షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ మూవీ మీద పవన్ అభిమానుల్లోను, ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్నాయి.పవన్ కెరీరిలోనే హై బడ్జెట్ అండ్ టెక్నీకల్ వాల్యూస్ తో ఏఏంరత్నం అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా జ్యోతికృష్ణ దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. నిధి అగర్వాల్(nidi agarwal)హీరోయిన్ కాగా యానిమల్ ఫేమ్ బాబీడియోల్(bobby deol)విలన్ గా చేస్తున్నాడు.
ఇక ఈ మూవీ 2025 ఉగాది కానుకగా మార్చి 28 న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.ఆ డేట్ కే ప్రస్తుతం విడి 12 గా సెట్స్ మీద ఉన్న విజయ్ దేవరకొండ(vijay devarakonda) కొత్త మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ మేరకు ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నసితార ఎంటర్ టైన్మెంట్స్ అధికారంగా చాలా రోజుల క్రితమే ప్రకటించింది.కానీ ఇప్పుడు ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతుందనే రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.పవన్ చాలా రోజుల తర్వాత వీరమల్లుతో వస్తుండటంతో అభిమానులు,ప్రేక్షకులు ఎక్కువ మంది వీరమల్లు వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని, దీంతో వరుస ప్లాపులతో ఉన్న విజయ్ అదే రోజు వచ్చి రిస్క్ చెయ్యడని అంటున్నారు.పైగా సితార ఎంటర్ టైన్మెంట్ అంటే పవన్ కి హోమ్ బ్యానర్ తో సమానం.
అందుకే పవన్ గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆ సంస్థ అధినేత నాగవంశీ(nagavamsi)పిఠాపురంలో పవన్ తరుపు ప్రచారం కూడా చేసాడు,ఈ బాండింగ్ దృష్ట్యా నాగ వంశీ కూడా తన విడి 12 ని వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.మరి ఈ రూమర్స్ ల్లో ఎంత వరకు నిజముందో కొన్ని రోజులైతే గాని తెలియదు
Also Read