తెర పంచుకోనున్న బాబాయ్-అబ్బాయ్! ఫ్యాన్స్‌కు పండగే!!
on Apr 9, 2020

బాబాయ్ పవన్ కల్యాణ్ అంటే అబ్బాయ్ రామ్‌చరణ్‌కు చాలా అభిమానం. అలాగే చరణ్ అన్నా కల్యాణ్‌కు ఇష్టం. చూస్తుంటే, సమీప భవిష్యత్తులో ఆ ఇద్దరూ తెర పంచుకొనేట్లు కనిపిస్తోంది. ఫిల్మ్‌నగర్‌లో జరుగుతున్న ప్రచారం నిజమే అయితే విరూపాక్ష సినిమాలో పవన్ కల్యాణ్, రామ్‌చరణ్ కలిసి కనిపించనున్నారు. వకీల్ సాబ్ మూవీతో పాటు క్రిష్ డైరెక్షన్‌లో ఇంకో సినిమా కూడా పవర్ స్టార్ చేస్తున్న విషయం తెలిసిందే. పీకే27గా పిలుస్తున్న ఈ మూవీ కోసం విరూపాక్ష, వారాహి అనే రెండు టైటిల్స్‌ను నిర్మాత ఎ.ఎం. రత్నం రిజిస్టర్ చేయించారు. వీటిలో విరూపాక్ష టైటిలే ఖాయమవుతుందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
కాగా ఇందులో ఒక స్పెషల్ అప్పీరెన్స్ లాంటి క్యారెక్టర్ కోసం రామ్‌చరణ్‌ను కల్యాణ్ స్వయంగా అడిగినట్లు వినిపిస్తోంది. బాబాయ్ అడిగితే అబ్బాయ్ కాదంటాడా! వెంటనే అతను సరేనన్నాడని సమాచారం. ఈ ప్రచారమే కనుక వాస్తవమైతే బాబాయ్-అబ్బాయ్ కలిసి తెరపై కనిపించే తొలి సినిమా విరూపాక్ష అవతుంది. అంతేకాదు, సినిమాకూ అది బోనస్ అయినట్లే. ఈ మూవీలో కల్యాణ్ జోడీగా శ్రీలంక సుందరి జాక్వలిన్ ఫెర్నాండెజ్ ఎంపికైంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



