మహేశ్ తో మరోసారి కాజల్.. బిజినెస్ మేనా? బ్రహ్మోత్సవం నా?
on Sep 19, 2023
సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన కనువిందు చేసిన కథానాయికల్లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకు రెండు సినిమాలు వచ్చాయి. 2012 సంక్రాంతికి రిలీజైన 'బిజినెస్ మేన్' ఘనవిజయం సాధించగా.. 2016 వేసవికి సందడి చేసిన 'బ్రహ్మోత్సవం' డిజాస్టర్ గా నిలిచింది.
కట్ చేస్తే.. ఏడేళ్ళ తరువాత మహేశ్ కి జతగా మరోమారు కాజల్ దర్శనమివ్వనుందట. ఆ వివరాల్లోకి వెళితే.. 'అతడు', 'ఖలేజా' తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మహేశ్ ఇంకో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'గుంటూరు కారం' పేరుతో తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేశ్ కి జోడీగా శ్రీలీల, మీనాక్షి చౌదరి కనిపించబోతున్నారు. కాగా, ఈ చిత్రంలో ఓ స్పెషల్ రోల్ ఉందట. ఆ పాత్రలో కాజల్ ని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. కాజల్ కూడా ఈ పాత్రకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. మరి.. బిజినెస్ మేన్ లా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో లేదంటే బ్రహ్మోత్సవంలా డిజప్పాయింట్ చేస్తుందో చూడాలి.
కాగా, 2024 సంక్రాంతి కానుకగా గుంటూరు కారం రిలీజ్ కానుంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
