బాలయ్య ఇల్లు "మాల్"గా మారుతుందా..?
on Feb 22, 2018

సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురించి ఇప్పుడు ఫిలింనగర్‌లో ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్‌లో బాలయ్య నివసిస్తోన్న ఇల్లు అతి త్వరలో ఒక షాపింగ్ మాల్‌గా మారబోతోందట. ఇందుకోసం తన ఇంటిని డెవలప్‌మెంట్ పద్దతిలో ఇస్తున్నారని.. ఇప్పటికే అగ్రిమెంట్ కూడా పూర్తయ్యిందని.. అతి త్వరలోనే సదరు కంపెనీ బాలకృష్ణ ఇంటిని కూల్చబోతుందన్నది ఆ వార్త సారాంశం.
అయితే బాలయ్యకు తొలి నుంచి ఈ ఇల్లు సెంటిమెంట్.. ఇక్కడికి వచ్చాకే నటసింహానికి తిరుగులేని స్టార్‌డమ్ వచ్చింది.. దానికి తోడు ఈ లైన్‌లో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువే.. అలాగే గతంలో బాలయ్య ఇంటి స్థలాన్ని రోడ్డు వెడల్పు కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని వార్తలు వచ్చాయి. మరి ఇలాంటి చోట మాల్ నిర్మిస్తే ట్రాఫిక్‌కు మరింత ఇబ్బంది కలుగుతుంది.. అలాంటప్పుడు మాల్ కనస్ట్రక్షన్‌కి జీహెచ్ఎంసీ అనుమతినిస్తుందా..? అయితే బాలయ్యకు జంట నగరాల్లో చాలా చోట్ల ఆస్తులున్నాయి. వాటిలో ఏదైనా దానిలో మాల్ నిర్మించాలని అనుకున్నారేమో...? దానిని జనాలు పొరపాటు పడ్డారేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



