బాలయ్యను మరో "రోగ్" చేస్తాడా..?
on Apr 1, 2017
గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ హిట్ తర్వాత బాలయ్య ఎలాంటి సినిమా చేయబోతున్నాడు..ఎవరితో చేస్తాడు అని టాలీవుడ్ మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసింది. ఎంతో మంది క్రేజీ డైరెక్టర్స్ నటసింహంతో సినిమా చేసేందుకు ఆయన ఇంటి ముందు క్యూకట్టారు. అయితే అందరికీ షాక్ ఇస్తూ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేశాడు బాలకృష్ణ. అప్పటికే లోఫర్, ఇజమ్ లాంటి వరుస ఫ్లాపులతో బండి నెట్టుకొస్తున్న పూరీకి బాలయ్య ఎలా ఛాన్స్ ఇచ్చాడా అని అభిమానులు తలపట్టుకున్నారు..అయితే హీరోలకు డిఫరెంట్ ఇమేజ్ అందించే పూరీ అనగానే బాలయ్య ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీలయ్యారు.
అయితే ఈ శుక్రవారం రిలీజైన రోగ్కి నెగిటివ్ టాక్ రావడంతో నందమూరి అభిమానులు ఉలిక్కిపడ్డారు. ఇలాంటి ఫలితమే తమ హీరోకు కూడా ఎదురవుతుందేమోనని వారు భయపడుతున్నారు. కాని వరుస ఫ్లాప్ల మధ్య కూడా జూనియర్ ఎన్టీఆర్కు "టెంపర్" లాంటి హిట్ ఇచ్చిన ట్రాక్ రికార్డు పూరికి ఉండటంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పిల్చుకుంటున్నారు. మరి అభిమానుల నమ్మకాన్ని పూరీ ఎంతవరకు నెరవేరుస్తాడో వేచి చూడాలి.