నాగచైతన్య రిజెక్ట్ చేశాడు.. మరి నాని ఓకే అంటాడా?
on Oct 3, 2023
ఒక హీరో రిజెక్ట్ చేసిన కథతో మరో హీరో సినిమా చేసి సూపర్‌హిట్ కొట్టడం.. లేదా ఒక హీరో రిజెక్ట్ చేసిన కథతో సినిమా చేసి ఫ్లాప్ అందుకోవడం.. ఇది సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణంగా జరిగే విషయం. ఇలాంటివి పెద్ద హీరోల విషయంలోనే కాదు, చిన్న హీరోల విషయంలోనూ జరుగుతూ ఉంటాయి. అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కొత్త తరహా కథలు రావాలంటే కొత్తవారికి అవకాశం ఇవ్వాలి. రోజురోజుకీ ప్రేక్షకుల అభిరుచులు, ఆలోచనలు మారుతున్నాయి. వాటికి తగ్గట్టుగానే కొత్త డైరెక్టర్లు కూడా అప్‌డేట్ అవుతుంటారు. కాబట్టి కొత్త డైరెక్టర్లను ఎంకరేజ్ చెయ్యడం ఎంతో అవసరం అనే విషయాన్ని కొందరు హీరోలు గ్రహించారు. వారిలో రవితేజ ఒకరు. అతను ఎంతో మంది కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చాడు. రవితేజ తర్వాత నాని దాన్ని కొనసాగిస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెలకు దర్శకుడుగా అవకాశం ఇచ్చి ‘దసరా’ చిత్రంతో సూపర్‌హిట్ కొట్టాడు నాని. ‘హాయ్ నాన్న’ చిత్రం ద్వారా శౌర్యున్ ని డైరెక్టర్‌గా పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్‌లో రిలీజ్ కానుంది.
ఇదిలా వుండగా, ఇప్పుడు నాని మరో కొత్త డైరెక్టర్‌కి అవకాశం ఇవ్వబోతున్నాడన్న వార్త వినిపిస్తోంది. అతను చెప్పే కథ వినడానికి నాని ఓకే చెప్పాడని సమాచారం. అయితే అతను ఎవరు అనే విషయం తెలియకపోయినా అతనికి సంబంధించిన ఒక విషయం మాత్రం తెలిసింది. ఇదే కథను నాగచైతన్యకు వినిపించాడట. కానీ, చైతన్యకు నచ్చకపోవడంతో అదే కథను నానికి చెప్పడానికి రెడీ అయ్యాడని చెప్పుకుంటున్నారు. ఫిలింనగర్‌లో వినిపిస్తున్నట్టు నానికి చెప్పబోతున్న కథ, ఆల్రెడీ నాగచైతన్యకు చెప్పినదేనా? లేక నాని కోసం కొత్త కథ ఏదైనా సిద్ధం చేశాడా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
