Mowgli 2025: షాకింగ్.. అప్పుడే ఓటీటీలోకి మోగ్లీ..!
on Dec 16, 2025

ఇటీవల కాలంలో మెజారిటీ సినిమాలు నాలుగు వారాలకే ఓటీటీలోకి అడుగు పెడుతున్నాయి. కొన్ని కొన్ని సినిమాలు మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చి షాక్ ఇస్తున్నాయి. ఇప్పుడు ఆ లిస్టులో 'మోగ్లీ' కూడా చేరనుందని న్యూస్ వినిపిస్తోంది. (Mowgli 2025)
రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్, బండి సరోజ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'మోగ్లీ'. సందీప్ రాజ్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 12 రాత్రి ప్రీమియర్లతో థియేటర్లలో అడుగుపెట్టింది. ఈ సినిమా డివైడ్ టాక్ నే సొంతం చేసుకుంది. పైగా, ప్రస్తుతం థియేటర్లలో 'అఖండ-2' హవా ఉండటంతో వసూళ్ల పరంగా పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. ఇలాంటి సమయంలో 'మోగ్లీ' మూవీ ఓటీటీ డేట్ లాక్ అయిందనే వార్త ఆసక్తికరంగా మారింది.
Also Read: ఇదెక్కడి ట్రైలర్ రా మావ.. లేడీ గెటప్ లో సూపర్ స్టార్!
'మోగ్లీ' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. ఈ సినిమాని త్వరలోనే స్ట్రీమింగ్ చేయడానికి ఈటీవీ విన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 31 రాత్రి నుంచి స్ట్రీమింగ్ చేయనుందని సమాచారం. అంటే మూడు వారాలు కూడా తిరగకుండానే 'మోగ్లీ' మూవీ ఓటీటీలోకి రాబోతుంది అన్నమాట. మరి ఈ న్యూస్ లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



