ఆయన్ని ఇంకా కన్ఫర్మ్ చేయలేదంట!
on Jul 18, 2016

మెగా రీఎంట్రీ సినిమా అప్పుడే మూడో షెడ్యూల్ జరుపుకొంటోంది. అయితే.. ఇప్పటివరకూ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వకపోవడంతో మెగాభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఇంకో విషయం తెలిసింది. తమిళంలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ దేశ్ ముఖ్ పోషించిన నెగిటివ్ క్యారెక్టర్ ను తెలుగులో హీరో టర్నడ్ విలన్ జగపతిబాబు పోషించనున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే కదా.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమింటంటే.. విలన్ రోల్ కోసం జగపతిబాబును సంప్రదించిన విషయం నిజమే కానీ, ఇప్పటివరకూ ఆయన్ని విలన్ గా కన్ఫర్మ్ చేయలేదట. ఈ విషయాన్ని జగపతిబాబు స్వయంగా తెలియజేశారు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండగా.. చిరుతో షూటింగ్ ఎప్పట్నుంచి అని అడగ్గా ఆయన ఈ సమాధానం చెప్పేసరికి ఆశ్చర్యపోవడం మీడియా వంతైంది. మరి చిరంజీవి అండ్ గ్యాంగ్ హీరోయిన్ లాగే విలన్ విషయంలోనూ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదా? లేక జగపతిబాబును కాకుండా మరెవర్నైనా తీసుకొనే ఆలోచనలో ఉన్నారా? అనేది తెలియాల్సి ఉంది!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



