మెగాస్టార్‌ను పట్టించుకునే వారే లేరా..?
on Aug 24, 2017
మూడు దశాబ్దాల పాటు తెలుగుతెరను మకుటంలేని మహారాజుగా ఏలిన వ్యక్తి..పదేళ్లు ఇండస్ట్రీకి దూరమైనా చెక్కుచెదరని అభిమాన గణం..అలాంటి హీరోకి సంబంధించి ఎలాంటి న్యూస్ వచ్చినా సెన్సేషనే..కానీ అనేక ప్రభంజనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాల్సిన ఒక వార్తను చాలా తక్కువగా పట్టించుకున్నారు జనాలు. వివరాల్లోకి వెళితే..సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న 151వ సినిమా సైరా నరసింహారెడ్డి..చిరు బర్త్ డే గిఫ్ట్‌గా ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మరి ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ఈ పోస్టర్‌కు యూట్యూబ్‌లో ఎలాంటి టాక్ వచ్చిందా అని తెలుసుకోవాలనుకోవడం సహజం..మెగా అభిమానులు కూడా రికార్డులు తిరగరాస్తుందని భావించారు కూడా కానీ ఫలితం అందుకు విరుద్ధంగా వచ్చింది. ఆగస్టు 22 మధ్యాహ్నం రిలీజైన సైరా నరసింహారెడ్డి మోషన్ పోస్టర్‌కు 48 గంటల్లో కేవలం 1.8 మిలియన్ క్లిక్స్ రావడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవలి కాలంలో చిన్న చిన్న సినిమాల పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ కూడా మొదటి రెండు రోజుల్లోనే సులభంగా 2, 3 మిలియన్ల క్లిక్స్‌ను అందుకుంటున్న సమయంలో సైరా నరసింహారెడ్డి పోస్టర్‌కు ఇలాంటి స్పందన రావడాన్ని మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకిలా జరిగిందబ్బా..?