బ్రహ్మోత్సవం డిజాస్టర్ వెనుక నమ్రత హ్యాండ్..?
on May 25, 2016
సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం నటించడం వరకూ మాత్రమే చూసుకుంటారు. మిగిలిన వ్యవహారాలన్నీ తన శ్రీమతి నమ్రతకే వదిలేస్తారు. ఇది ఇండస్ట్రీలో చాలామందికి తెలిసిన వాస్తవం. అయితే, సక్సెస్ లో ఎంత పార్ట్ తీసుకుంటారో, ఫెయిల్యూర్ లో కూడా అంతే భాగం తీసుకోవాలి. శ్రీమంతుడు సక్సెస్ వెనుక నమ్రత హ్యాండ్ కూడా ఉండటం ఎంత నిజమో, బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్ లోనూ ఆమె పాత్ర ఉందన్నది అంతే నిజం. ముఖ్యంగా మూవీ పబ్లిసిటీ విషయంలో పూర్తిగా నమ్రత ఇష్టప్రకారమే జరుగుతుంది. శ్రీమంతుడు సినిమా నమ్రత ప్రమోషన్ ప్రోగ్రామ్స్ తో పాటు, సినిమాలో కూడా విషయం ఉండటంతో బాగా ఆడింది. అయితే బ్రహ్మోత్సవం విషయానికొస్తే, ఇక్కడ కూడా నమ్రత తన స్టైల్లో అన్నీ ప్లాన్ చేసినా సినిమాకు కథ లేకపోవడం బెడిసికొట్టింది. ఇక్కడే నమ్రత తప్పటడుగు పడింది. మామూలుగా ఒక మూవీ ఫ్లాప్ టాక్ వస్తే, ఏదొకటి చేసి ఆ ఫ్లాప్ డిజాస్టర్ దిశగా వెళ్లకుండా ఆపుతారు మూవీ టీం. కానీ బ్రహ్మోత్సవం విషయంలో ఇది జరగలేదు. ఫస్ట్ డే ఫ్లాప్ టాక్ వచ్చినప్పుడు, నమ్రత గానీ, పివిపీ గానీ నష్టనివారణ చర్యలు తీసుకుని ఉంటే, మూవీ మరీ డిజాస్టర్ జోన్ లోకి జారిపోయి ఉండేది కాదు. వాళ్ల నుంచీ ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో, మీడియా యాంటీఫ్యాన్స్ కలిసి బ్రహ్మోత్సవాన్ని ఎడాపెడా ఏకిపారేశారు. దీంతో సినిమా మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అని పేరు తెచ్చుకుంది. ఎలాగో ఫ్లాప్ అయినప్పుడు, ఇక మనం ఏం చేసి ఏం లాభం అని అనుకున్నట్టున్నారు మూవీ టీం. ఏదేమైనా బ్రహ్మోత్సవం మహేష్, నమ్రతలకు ఒక చేదు జ్ఞాపకం అని చెప్పక తప్పదు.