మహేష్ స్వచ్ఛంద కార్యక్రమాల వెనుక రహస్యం...?
on May 11, 2016

సెలబ్రిటీలు ఏం చేసినా, లక్షలాది కళ్లు వాళ్లను చూస్తుంటాయి. వేసే ప్రతీ అడుగునూ స్కాన్ చేస్తుంటాయి. మంచి అయినా, చెడు అయినా కేవలం కొద్దిగా చేస్తే, రోజుల వ్యవధిలో అది రెట్టింపైపోతుంటుంది. ప్రస్తుతం తెలుగు సినీ సర్కిల్స్ లో ఇలా సెన్సేషన్ సృష్టిస్తోంది మహేష్ బుర్రిపాలెం పర్యటన. మహేష్ తన సినిమాల ప్రమోషన్ల సమయంలో మాత్రమే, పబ్లిసిటీ సంట్ గా ఇలా దత్తత తీసుకున్న గ్రామాలను సందర్శిస్తున్నాడని, పక్కనే అమరావతిలోని తన యాడ్ కాంపెయిన్ కోసమే అక్కడికి వచ్చాడు తప్ప, నిజంగా ఛారిటీ కార్యక్రమం కోసం కాదని మహేష్ యాంటీ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
విమర్శలకు తగ్గట్టే శ్రీమంతుడు టైం లో వచ్చిన మహేష్, ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు బ్రహ్మోత్సవం టైంలో ఊరికి వచ్చాడు. అది కాక, అమరావతిలోని ఒక బిల్డర్ కంపెనీతో యాడ్ కాంట్రాక్ట్ కూడా మహేష్ కు ఉంది. దీంతో మహేష్ బుర్రిపాలెం టూర్ పై చాలా విమర్శలు వస్తున్నాయి. మరో వైపు మహేష్ ఫ్యాన్స్ మాత్రం, తమ అభిమాన హీరో తెరపైనే తప్ప బయట నటించడని, బుర్రిపాలెం గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడని తమకు నమ్మకం ఉందంటున్నారు. ప్రస్తుతానికి మహేష్ ఈ వివాదంపై స్పందించనప్పటికీ, ఏదైనా రెస్పాన్స్ ఇస్తే బాగుంటుందని ఆయన అభిమానుల అభిప్రాయం. మరి మహేష్ ఈ కాంట్రవర్సీ కి ఫుల్ స్టాప్ పెడతాడో లేదో చూడాలి..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



